News November 19, 2025
KMR: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలోని పత్తి రైతులు బుధవారం నుంచి CCI కేంద్రాలకు పత్తిని తీసుకువెళ్లాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి సమస్యల పరిష్కారానికి మంగళవారం ఆయన కీలక సమావేశం నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు జిన్నింగ్ మిల్లర్లతో చర్చించారు. హామీలను నెరవేరుస్తామని చెప్పడంతో మిల్లుల యజమానులు బంద్ విరమించారని కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 16, 2026
జగిత్యాల : క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక పోటీలు

తెలంగాణ రాష్ట్రంలో హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి విద్యార్థుల ప్రవేశానికి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రవికుమార్ తెలిపారు. ఈ నెల 31న జగిత్యాలలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఏప్రిల్ 28న స్పోర్ట్స్ స్కూల్ హకీంపేటలో ఫైనల్ ఎంపికలు జరుగుతాయన్నారు.
News March 16, 2026
కొత్త సబ్జెక్టులతో UG, PG కోర్సులు

TG: పాత డిగ్రీ కోర్సులకు కాలం చెల్లింది. అవి నేటి అవసరాలకు తగ్గట్టు ఉంటేనే ఉపాధి అవకాశాలు. ఈదిశగా TGCHE వాటిని ప్రక్షాళించింది. UG, PGలలో డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, ల్యాండ్, అగ్రికల్చర్, ఎయిర్ లైన్స్, స్పేస్, మారిటైమ్, ఫిన్‌టెక్, INT.బ్యాంకింగ్, ఫైనాన్స్, మల్టీమీడియా, యానిమేషన్, బయోమెడిక్స్, MED.మైక్రో బయాలజీ, ఇమ్యూనాలజీ వంటివి పెట్టింది. ఈ సమాచారాన్ని ‘https://tgche.ac.in’లో పొందుపరిచింది.
News March 16, 2026
వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

అనంతపురం జిల్లా రెవెన్యూ భవన్‌లో ‘వేసవి వడగాల్పుల కార్యచరణ ప్రణాళిక-2026’పై కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 534 చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మధ్యాహ్నం ఎండలో తిరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువగా నీరు, మజ్జిగ తీసుకోవాలని సూచించారు.


