News November 19, 2025
MDK: లక్షల్లో జీతం.. లంచాలే నేస్తం!

లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా కొందరు అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఉమ్మడి జిల్లాలో కొందరు అధికారులు లంచాలకు అలవాటు పడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ముఖ్యంగా అవినీతిని అరికట్టాల్సిన పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారుల తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఈనెలలో ములుగు ఎస్ఐ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విషయం మర్చిపోకముందే మంగళవారం టేక్మాల్ ఎస్ఐ పట్టుబడ్డారు.
Similar News
News March 14, 2026
పుచ్చకాయ కొనేటప్పుడు ఇవి గమనించండి!

పుచ్చకాయపై ఉండే మచ్చ పసుపు/నారింజ రంగులో ఉంటే పండినట్లు, తెల్లగా ఉంటే ఇంకా పండనట్లు. గుండ్రటి కాయలు తీయగా ఉంటాయి. పొడవుగా ఉండేవి తక్కువ తీపి కలిగి ఉంటాయి. ఒకే సైజులో ఉన్న వాటిలో బరువు ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి. వాటిలో గుజ్జు, రసం ఎక్కువగా ఉంటాయి. కాయ కాడ పూర్తిగా ఎండిపోయి, మెరుపు తక్కువగా ఉంటే అది సహజంగా పాదుపైనే పండిందని అర్థం. గోధుమ రంగు గీతలు ఉన్న కాయలు చాలా తీయగా ఉంటాయి.
News March 14, 2026
నేడు గద్వాలకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి శనివారం జోగులాంబ గద్వాల జిల్లాకు రానున్నారు. గద్వాల పట్టణంలో జరగనున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తనయుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్య వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12గంటలకు సీఎం గద్వాలకు చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారని పేర్కొన్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
News March 14, 2026
మెదక్: ‘ఎస్సీలకు ఆర్థిక సాయం..17లోగా దరఖాస్తు చేసుకోండి’

మెదక్ జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి 2025-26 వార్షిక ప్రణాళికలో భాగంగా రూ. 236.60 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లా అధికారి విజయలక్ష్మి తెలిపారు. దీని ద్వారా 249 మందికి లబ్ధి కలగనుంది. ఇందులో 119 ఈవీ బైక్‌లు, 59 ఆటో రిక్షాలు, 12 వ్యవసాయ యూనిట్లు కేటాయించారు. ఆసక్తిగల వారు ఈ నెల 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.


