News November 19, 2025

నిర్మల్: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు

image

నిర్మల్ జిల్లాలోని 9, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్ పాఠశాలల బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. http://telangana epass.cgg. gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 13, 2026

సిరిసిల్ల: TSCPSEU నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

image

తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU) రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత సీపీఎస్ (CPS) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించడమే తమ ప్రధాన లక్ష్యమని, జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులందరినీ ఏకం చేస్తూ భవిష్యత్తులో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.

News March 13, 2026

USతో ట్రేడ్ డీల్‌ నిలిపివేత వార్తలు.. భారత్ స్పందన!

image

అమెరికాపై అధిక టారిఫ్‌లు వేస్తున్నాయంటూ భారత్, చైనా సహా 16 దేశాలపై <<19359537>>దర్యాప్తునకు<<>> ట్రంప్ ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో USతో ట్రేడ్ డీల్‌ను ఇండియా నిలిపేయనుందని Reuters తెలిపింది. ఒప్పందంపై సంతకం చేయకుండా కొన్ని నెలలు ఆలస్యం చేయనుందని పేర్కొంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, పరస్పర ప్రయోజనకర ఒప్పందం కోసం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది.

News March 13, 2026

జగిత్యాల: ‘ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ఎలాంటి కొరత లేదు’

image

ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరా అంశాలపై హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ లు బిఎస్ లత, రాజా గౌడ్ లు పాల్గొన్నారు. అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందని ప్రచారం వాస్తవం కాదన్నారు.