News November 19, 2025
ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు: వరంగల్ పోలీసులు

ద్విచక్రవాహనాలపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సురక్షిత డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 11, 2026
ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు.!

ప్రకాశం జిల్లా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ, ఫైనల్ మెరిట్ జాబితాను మంగళవారం జిల్లా కో-ఆర్డినేటర్ విడుదల చేశారు. ఈ మేరకు ఆడియో మెట్రిటీషియన్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్ తదితర పోస్టుల తుది జాబితాను (prakasam.ap.gov.in)వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. అభ్యర్థులు గమనించాలని కోరారు.
News March 11, 2026
కృష్ణా: PG విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో పీజీ విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. నానో టెక్నాలజీ మినహా మిగతా కోర్సుల పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 1లోపు రూ.100 ఫైన్‌తో 2లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.
News March 11, 2026
గుంటూరు ప్రజలకు గుడ్‌న్యూస్

గుంటూరు మీదుగా మరో అమృత్ భారత్ రైలు ప్రయాణించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు డివిజన్ అధికారులు మంగళవారం తెలిపారు. ఇది మార్చి 13న అస్సాంలోని కామాఖ్య సుప్రసిద్ధ దేవాలయ దర్శనం తర్వాత బయలుదేరుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకుంటూ విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా చర్లపల్లి చేరుకుంటుందన్నారు. ఇది ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు.


