News November 19, 2025
ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు: వరంగల్ పోలీసులు

ద్విచక్రవాహనాలపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సురక్షిత డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 25, 2026
ఇరాన్ మైండ్ గేమ్: చమురు అస్త్రం సక్సెస్?

అగ్రరాజ్యాన్ని ఎదిరించి ఇరాన్ తన పంతం నెగ్గించుకుంది. యుద్ధంతో కలిగించే నష్టాల కంటే సుదీర్ఘ ఘర్షణతో గ్లోబల్ ఆయిల్ సంక్షోభం సృష్టించాలనే ఇరాన్ మైండ్ గేమ్ ఫలించిందని నిపుణులు అంటున్నారు. ఇంధన కొరత భయంతో ట్రంప్ వెనక్కి తగ్గడం, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును అంగీకరించడం ఆ దేశ వ్యూహాత్మక విజయానికి నిదర్శనం. నాయకత్వ మార్పు కోరుకున్న US చివరకు అదే నాయకత్వంతో రాజీకి రావడం ఇరాన్ సక్సెస్‌ను చాటిచెబుతోంది.
News March 25, 2026
ఈ నెలాఖరులోగా డీసీసీ పూర్తి కార్యవర్గం!

ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డీసీసీ కార్యవర్గాల ప్రకటన ఈ నెలాఖరులోగా వెలువడే అవకాశం ఉంది. 4 నెలల క్రితమే జిల్లా అధ్యక్షులను నియమించినప్పటికీ, పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటులో జరిగిన జాప్యం ద్వితీయ శ్రేణి నాయకుల్లో నిరుత్సాహాన్ని నింపింది. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కమిటీల ప్రతిపాదనలు అందడంలో ఆలస్యం కావడం వల్లే NLG, SRPT జిల్లాల కార్యవర్గాల ప్రకటన నిలిచిపోయింది.
News March 25, 2026
జగిత్యాల: వివిధ దినుసులు ధరలు ఇలా..!

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. పసుపు (పిల్ల కొమ్ము) క్వింటాల్ గరిష్ఠ ధర రూ.11,900, కనిష్ఠం రూ. 8,000, పసుపు (మండ కొమ్ము) గరిష్ఠం రూ. 10,500, కనిష్ఠం రూ. 7,000, మక్కలు గరిష్ఠం రూ. 1,880, కనిష్ఠం రూ. 1,606, కందులు గరిష్ఠం రూ. 6,889, కనిష్ఠం రూ. 6,050, అనుములు గరిష్ఠం రూ. 5,152, కనిష్ఠం రూ. 4,000గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.


