News November 19, 2025

NZB: స్వాధార్ గృహంలో సౌకర్యాలు మెరుగుపరచాలి: సబ్ కలెక్టర్

image

బోధన్ పట్టణంలోని స్వాధార్ గృహంను సబ్ కలెక్టర్ వికాస్ మహతో మంగళవారం జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీవోలతో కలిసి సందర్శించారు. నివాసితుల వసతి, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. తక్షణమే సౌకర్యాలు మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆయన సూచనలు జారీ చేశారు.

Similar News

News March 5, 2026

NZB: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు: డీఎంహెచ్‌వో

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తెలిపారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మాతా శిశు మరణాలతో పాటు నెల లోపు శిశువుల మరణాల సంఖ్యను తగ్గించడంపై చర్చించారు.

News March 5, 2026

నిజామాబాద్: ముగ్గురికి జైలు.. 26 మందికి భారీ జరిమానా!

image

నిజామాబాద్‌లో మద్యం తాగి వాహనాలు నడిపిన 29 మందికి కోర్టు భారీ జరిమానా, జైలు శిక్ష విధించింది. తనిఖీల్లో పట్టుబడిన వారిని ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారిలో 26 మందికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.2.60 లక్షల జరిమానా విధించారు. పులాంగ్‌కు చెందిన యాదగిరి, గూపన్‌పల్లికి చెందిన రాజేశ్వర్, ఒడ్డట్‌పల్లికి చెందిన నవీన్ కుమార్‌లకు వారం రోజుల జైలు శిక్ష పడింది.

News March 5, 2026

NZB: ఈ మండలాలకు రిపోర్టర్లు కావలెను

image

ఆర్మూర్, ఆలూరు, నందిపేట, డొంకేశ్వర్, మాక్లూర్, జక్రాన్‌పల్లి, ముప్కాల్, మెండోరా, మోర్తాడ్, ఇందల్వాయి, డిచ్‌పల్లి, రెంజల్, కోటగిరి మండలాలకు Way2Newsలో పని చేసేందుకు అనుభవం కలిగిన రిపోర్టర్లు కావలెను. ఆసక్తి గల వారు <>లింకును క్లిక్ చేసి<<>> నమోదు చేసుకోండి.