News April 13, 2024
జైలర్ సినిమాకు సీక్వెల్‌గా ‘హుకుం’?

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా గతేడాది విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. దీనికి ‘హుకుం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ ‘వెట్టయాన్’ (తెలుగులో వేటగాడు) అనే మూవీ చేస్తున్నారు.
Similar News
News March 25, 2026
అమరావతిలో అగ్నిప్రమాదాలు.. దర్యాప్తు ముమ్మరం

AP: అమరావతిలో అగ్నిప్రమాదాలపై పోలీసు శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. CCTV ఫుటేజ్‌లను పరిశీలిస్తూ ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరిస్తోంది. ఇటీవల L&T కంపెనీ, తాజాగా మేఘా ఇంజినీరింగ్ కంపెనీ పైపులు దగ్ధమైన సంగతి తెలిసిందే. అయితే అవి 130 డిగ్రీల వేడికి తప్ప చిన్న మంటలకు దగ్ధం కావనేది నిపుణుల అభిప్రాయం. కాగా వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర ఉండొచ్చని <<19466902>>CM అనుమానం<<>> వ్యక్తం చేశారు.
News March 25, 2026
ఓవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

AP: రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల్లో ఎండల తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ‘ఎల్ నినో’ కారణంగా ఈసారి ఉష్ణోగ్రతలు గత ఏడాది కంటే 2-4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది. మరోవైపు ఈనెల 28 వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27,28 తేదీల్లో గంటకు 40-60kms వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం సహా పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
News March 25, 2026
డీలిమిటేషన్ ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగింది?

రాజ్యాంగం ప్రకారం పదేళ్లకోసారి <<19460921>>డీలిమిటేషన్<<>> (జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో సీట్ల పెంపు, నియోజకవర్గాల సరిహద్దుల సర్దుబాటు) చేపట్టాలి. గతంలో 1952, 1963, 1973లో చేపట్టారు. ఆ తర్వాత జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలకు నష్టం జరగొద్దని 25yrs నిలిపివేశారు. ఆ తర్వాత కూడా అవే పరిస్థితులు ఉండటంతో మరో 25yrs పొడిగించారు. 2002లో డీలిమిటేషన్ చేపట్టినా సీట్ల సంఖ్య పెంచకుండా నియోజకవర్గ పరిధులను మాత్రమే మార్చారు.


