News April 13, 2024

ఆ వార్తలు అవాస్తవం: జనసేన

image

AP: ఈనెల 17న కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారన్న వార్తను జనసేన పార్టీ ఖండించింది. ‘కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌లో బీజేపీ తరఫున ఈ నెల 17న పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు అవాస్తవం. 17వ తేదీన TDP చీఫ్ చంద్రబాబుతో కలిసి ఆయన కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ పర్యటన ఇప్పటికే ఖరారయ్యింది’ అని ట్వీట్ చేసింది.

Similar News

News March 18, 2026

అధికారం పీకేసినా అదే అహంకారం: CM

image

TG: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ‘కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావించుకుంటున్నారు. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు పోలేదు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వారి తీరు మారలేదు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి.. అధికారం పీకేసినా అదే అహంకారం. గవర్నర్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదు’ అని అసెంబ్లీలో విమర్శించారు.

News March 18, 2026

భారత్‌కు రెండు షిప్పుల్లో LPG.. ఒక్క రోజుకే సరిపోతుందన్న చిదంబరం!

image

శివాలిక్, నందాదేవి షిప్పుల్లో భారత్‌కు చేరుకున్న ఎల్పీజీ ఒకటిన్నర రోజులకు మాత్రమే సరిపోతుందని కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం ట్వీట్ చేశారు. ‘మార్చి 14-17 మధ్య శివాలిక్, నందాదేవి షిప్పులు హార్ముజ్ జలసంధిని క్రాస్ చేసి భారత్‌కు చేరాయి. ఈ 2 షిప్పులు కలిసి 92,700 మెట్రిక్ టన్నుల LPG తీసుకొచ్చాయి. గూగుల్ సమాచారం ప్రకారం దేశంలో ఉన్న ప్రస్తుత డిమాండ్‌కి ఇది 1.25 లేదా 1.6 రోజులకు సరిపోతుంది’ అని పేర్కొన్నారు.

News March 18, 2026

ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ఎప్పుడంటే?

image

AP: 2026-27 ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. సెకండియర్ విద్యార్థులకు ఏప్రిల్ 1న కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. ఆ రోజు నుంచి 23వ తేదీ వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1న ఫస్టియర్, సెకండియర్ క్లాసులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 10 నుంచి 20 వరకు దసరా, 2027 JAN 9-17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.