News November 19, 2025
VKB: మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్

మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ నారాయణరెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. డ్రగ్స్ రైతు సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలన్నారు.
Similar News
News March 22, 2026
‘నలభీమ పాకం’ అర్థం ఏమిటి?

మగవాళ్లు అత్యంత రుచికరమైన వంటకం చేసినప్పుడు ‘నలభీమ పాకం’ జాతీయాన్ని ఉపయోగిస్తారు. భారతంలో దమయంతి భర్త నలుడు. జూద వ్యసనంతో నిషాధ రాజ్యాన్ని కోల్పోయి బుషపర్ణుడి వద్ద వంటవాడిగా చేరి అద్భుతమైన వంటలు చేసేవారు. పాండవుల అజ్ఞాతవాసంలో విరాటరాజు దగ్గర భీముడు వంట పనిచేసేవారు. వీరిద్దరి పనిని కవులు నలభీమ పాకంగా అభివర్ణించారు. మీలో ఎవరైనా రుచికరమైన వంటలు చేసేవారున్నారా? కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 22, 2026
నక్కపల్లి: ట్రాఫిక్ నిబంధనలపై ఎస్పీ సూచనలు

నక్కపల్లిలో 23న స్టీల్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ తుహీన్ సిన్హా విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభకు వచ్చే బస్సులు, ఆటోలు కాగిత జంక్షన్ నుంచి కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవాలన్నారు. వీఐపీ పాసులు ఉన్నవారు మాత్రమే ఉపమాక జంక్షన్ మీదుగా సభా ప్రాంగణం చేరుకోవాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించాలని కోరారు.
News March 22, 2026
శ్రీకాకుళం జిల్లాలోని బీసీ హాస్టల్స్ అప్‌డేట్

శ్రీకాకుళం జిల్లాలో 81 బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలుండగా 56 ప్రభుత్వ, 25 ప్రైవేట్ భవనాల్లో సుమారు 6,800 మంది విద్యార్థులున్నారు. ఈ గృహాల్లో ఆర్ఓ ప్లాంట్లు, మరుగుదొడ్లు, పవర్ కట్ సమయంలో ఇబ్బంది లేకుండా ఇన్వర్టర్లు, పక్కా మెనూ, కొత్త నిర్మాణాలు నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోట్లల్లో నిధులను వెచ్చించనుంది. విద్యార్థులకు ప్రత్యేక వసతుల కల్పనపై దృష్టి పెట్టినట్లు బీసీ సంక్షేమ శాఖాధికారి అనురాధ చెప్పారు.


