News November 19, 2025

సంగారెడ్డి: 20న నిరుద్యోగులకు జాబ్ మేళా

image

SRD జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్ (EGMM) ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారిణి జ్యోతి తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయం బైపాస్ రోడ్‌లో 20న ఉదయం 10 గంటలకు మేళా జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 99664 64500 నంబర్ను సంప్రదించాలన్నారు.

Similar News

News March 21, 2026

త్వరలో ప్రధాని మోదీ తెలంగాణ టూర్!

image

ప్రధాని మోదీ రానున్న రోజుల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో GHMC ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మోదీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ రెండో వారంలో ప్రధాని టూర్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

News March 21, 2026

శ్రీసత్యసాయి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

image

శ్రీసత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు చనిపోయారు. పెనుకొండ-అనంతపురం జాతీయ రహదారిపై గుట్టూరు సమీపంలో బ్లాక్ స్పాట్ గుర్తించారు. అక్కడ ప్రమాదాలు అరికట్టేలా హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు.

News March 21, 2026

BREAKING: KNR: భార్య చనిపోయిందని SI సూసైడ్

image

కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తగారింట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈనెల 17న ఆయన <<19415582>>భార్య దివ్య<<>> కడుపునొప్పి భరించలేక గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకోగా, మనస్తాపానికి గురైన ఎస్సై సైతం ప్రాణాలు తీసుకున్నారు. వరుస మరణాలతో ఇద్దరు చిన్న పిల్లలు అనాథలయ్యారు. మృతదేహాన్ని జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు.