News November 19, 2025

సంగారెడ్డి: 20న నిరుద్యోగులకు జాబ్ మేళా

image

SRD జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్ (EGMM) ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారిణి జ్యోతి తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయం బైపాస్ రోడ్‌లో 20న ఉదయం 10 గంటలకు మేళా జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 99664 64500 నంబర్ను సంప్రదించాలన్నారు.

Similar News

News March 13, 2026

MBNR: ఈనెల 15 నుంచి అంబేడ్కర్ వర్సిటీ తరగతులు

image

మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సెమిస్టర్ II, IV, VI తరగతులు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 80 శాతం హాజరు ఉన్న విద్యార్థులనే పరీక్షలకు అనుమతిస్తామని ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి తెలిపారు. మరిన్ని వివరాల కోసం 73829 29609 నంబరును సంప్రదించాలని కోరారు.

News March 13, 2026

టెన్త్ పరీక్షా కేంద్రాల ఆంక్షలు అమలు: ఎస్పీ నరసింహ

image

సూర్యాపేట జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ కె. నరసింహ తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదని, జీరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశామన్నారు.

News March 13, 2026

వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బోర్లు, పైప్‌లైన్లు, చేతిపంపులను వెంటనే మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలని, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. ప్రజలకు తాగునీటి సమస్యలు ఉంటే వెంటనే స్పందించాలని అధికారులకు తెలిపారు.