News November 19, 2025

RGM: ‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి: సీపీ

image

‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజల సహకారం అత్యంత అవసరమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని అధికారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా, అమ్మకం వంటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీపీ పిలుపునిచ్చారు.

Similar News

News March 15, 2026

LPG కంటే PNG బెటర్ అంటున్న నిపుణులు!

image

దేశ ప్రజలు ఎల్పీజీ కాకుండా PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్)వైపు మళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. మన దేశానికి దిగుమతి అయ్యే LPGలో 90% హార్ముజ్ నుంచే వస్తోంది. ఇప్పుడది క్లోజ్ కావడంతో ఇబ్బందులు వస్తున్నాయి. అయితే LPGతో పోలిస్తే PNGకి డిమాండ్ తక్కువగా ఉంది. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి కొరత వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

News March 15, 2026

పెద్దపల్లి: ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాలు: ఎస్ఈ

image

విద్యుత్ సరఫరాలో ప్రకృతి విపత్తులు లేదా సాంకేతిక కారణాల వల్ల ఏర్పడే అంతరాయాలను త్వరగా పరిష్కరించేందుకు పెద్దపల్లి సర్కిల్ పరిధిలో ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ (ERT)వాహనాలను వినియోగిస్తున్నట్లు SE వి.గంగాధర్ తెలిపారు. సర్కిల్ పరిధిలో 2 ERT వాహనాలు, సబ్‌డివిజన్ స్థాయిలో 7 వాహనాలు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. విద్యుత్ సమస్యలపై వినియోగదారులు 24 గంటలు పనిచేసే టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలన్నారు.

News March 15, 2026

కామారెడ్డి: ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణలో మార్పులు

image

కామారెడ్డి జిల్లాలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ విధానంలో మార్పులు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జనగణన-2027 శిక్షణ కార్యక్రమాల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను కలెక్టరేట్‌లోని 25వ నంబర్ గదిలో స్వీకరించనున్నట్లు వివరించారు.