News November 19, 2025
HYD: ప్లాస్టిక్ బాటిల్స్, పాత్రలు వాడుతున్నారా?

ప్రతిచోట ప్లాస్టిక్ కామన్ అయిపోయింది. మైక్రోప్లాస్టిక్స్‌తో మానవ శరీరంలో క్యాన్సర్స్, లీకీగట్, ఆహారాన్ని జీర్ణాశయం శోషించుకోలేకపోవడం వంటివి సైంటిస్టులు గుర్తించారు. HYDలో ప్రతి ఒక్కరి కడుపులోకి 0.8% మైక్రోప్లాస్టిక్ వెళ్తున్నట్లు ‘హెల్త్ మైక్రో ప్లాస్టిక్ కవరేజ్’ వెల్లడించింది. ప్లాస్టిక్‌కు వేడి తగిలితే నానోపార్టికల్స్ రిలీజ్ అవుతాయని, పింగాణీ, స్టీల్, ఇత్తడి, మట్టిపాత్రలు వాడాలని సూచించింది.
Similar News
News March 24, 2026
ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

రాబోయే 2-3 గంటల్లో మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ADB, HYD, BHPL, KNR, ASF, MBNR, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కాగా ఇప్పటికే HYDలో వర్షం కొనసాగుతోంది. అటు ఏపీలో రేపు అల్లూరి, పోలవరం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశముందని APSDMA పేర్కొంది.
News March 24, 2026
మారుమూల గ్రామాలకు రోడ్డు పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నక్సల్స్ ప్రభావిత మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరిచే రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో 30 పనుల పురోగతిని సమీక్షించారు. ఇప్పటికే 10 రోడ్లు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసి గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించాలని సూచించారు.
News March 24, 2026
రంగారెడ్డి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ

చిల్కూర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మార్చి 25 నుంచి గ్రామీణ యువకులకు ఉచిత CCTV శిక్షణ ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా వారికి 30 రోజుల శిక్షణ, ఉచిత హాస్టల్, భోజనం, యూనిఫాం, టూల్‌కిట్స్ అందిస్తారు. 18-45 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి గల వారు అవసరమైన ధృవపత్రాలతో నమోదు చేసుకోవాలని డైరెక్టర్ మొహమ్మద్ అలీ ఖాన్ తెలిపారు. పూర్తి వివరాలకు 8500165190 నంబర్‌కు సంప్రదించాలన్నారు.


