News November 19, 2025

బంధంలో సైలెంట్ కిల్లర్

image

కొంతమంది మాట్లాడకుండా కూడా వేధిస్తుంటారు. దీనినే స్టోన్ వాలింగ్ అంటారు. వీరు ఇతరులతో పెద్దగా మాట్లాడరు. సీరియస్‌గా మాట్లాడుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ముభావంగా ఉండడమో, మధ్యలోనే వెళ్లిపోవడమో చేస్తుంటారు. కొందరు అక్కర్లేని విషయాల గురించి ప్రస్తావిస్తుంటారు. కొన్నిసార్లు అసలు విషయం చెప్పకుండా ఆరోపణలు చేస్తుంటారు. ఇలాంటివారు తమ చేష్టలతో జీవిత భాగస్వామికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారు.

Similar News

News December 8, 2025

DRDO CFEESలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

DRDO అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్& ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (CFEES)లో 38 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరుతేదీ. టెన్త్, ఇంటర్, ITI ఉత్తీర్ణులై, 18- 27ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. ముందుగా ncvtmis.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టైపెండ్ నెలకు రూ.9600 చెల్లిస్తారు. https://www.drdo.gov.in/

News December 8, 2025

నాణ్యత లేని పాల వల్లే డెయిరీఫామ్ వైపు అడుగులు

image

మండి నగరంలో పాల నాణ్యత పట్ల అసంతృప్తితోనే సకీనా ఈ రంగంలోకి అడుగు పెట్టారు. స్థానిక పాడి రైతు చింతాదేవి, YouTubeలోని పాడిపరిశ్రమలో రాణిస్తున్న వారి అనుభవాలను తెలుసుకొని ముందుకుసాగారు. 2024లో తన దగ్గర ఉన్న రూ.1.25 లక్షలు, బ్యాంకు నుంచి రూ.2లక్షల రుణంతో.. పంజాబ్‌ నుంచి హోల్‌స్టెయిన్ ఫ్రైసియన్(HF) ఆవులను కొని ఫామ్ ప్రారంభించారు. తొలుత తక్కువ ఆవులే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 14కు చేరింది.

News December 8, 2025

ఇతిహాసాలు క్విజ్ – 90

image

ఈరోజు ప్రశ్న: రాముడు, ఆంజనేయుడి మధ్య యుద్ధం జరిగినట్లు కొన్ని పురాణాలు చెబుతున్నాయి. మరి ఆ యుద్ధం ఎందుకు జరిగిందో మీకు తెలుసా?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>