News November 19, 2025
ASF వయోవృద్ధుల సంరక్షణకు టోల్ ఫ్రీ నంబర్

తల్లిదండ్రులను సరిగా పోషించని బిడ్డలపై ఇప్పటి వరకు ASF జిల్లాలో 28 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మార్పునకు కృషి చేస్తున్నామన్నారు. వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం – 2007 ప్రకారం ట్రిబ్యునల్లు పనిచేస్తున్నాయని తెలిపారు. నిరాదరణకు గురైన వయోవృద్ధులు టోల్ ఫ్రీ నం.14567లో సంప్రదించవచ్చని సూచించారు.
Similar News
News March 19, 2026
VZM: చెరువులో దూకి స్టూడెంట్ సూసైడ్

చెరువులో దూకి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న బాడంగి మండలం బొత్సవానిపాలెం గ్రామానికి చెందిన బొత్స దిలీప్ కుమార్ కుక్కలవారిపాలెం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఇటీవల కొన్ని అప్పులు చేశాడని వాటిని తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 19, 2026
ALERT: ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని APSDMA హెచ్చరించింది. శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, NLR, కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి, కడప, చిత్తూరు, TPTYలో తేలికపాటి-మోస్తరు వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. కాగా చిత్తూరు, కడపలోని పలు ఏరియాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది.
News March 19, 2026
మగ్గంపై చీర నేతను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ, హ్యాండ్లూమ్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియాతో కలిసి విజయవాడలో బుధవారం ‘గాంధీ బునకర్ చేనేత మేళా’ను ప్రారంభించారు. పలు ప్రాంతాల హ్యాండ్లూమ్ సంఘాలు ఈ మేళాలో పాల్గొని తమ సంప్రదాయ వస్త్రాలను ప్రదర్శిస్తాయని నిర్వాహకులు కలెక్టర్‌కు తెలిపారు. మేళాలో కలెక్టర్ లక్ష్మీశ, మగ్గంపై చీర నేతను పరిశీలించారు.


