News November 19, 2025

ASF వయోవృద్ధుల సంరక్షణకు టోల్ ఫ్రీ నంబర్

image

తల్లిదండ్రులను సరిగా పోషించని బిడ్డలపై ఇప్పటి వరకు ASF జిల్లాలో 28 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మార్పునకు కృషి చేస్తున్నామన్నారు. వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం – 2007 ప్రకారం ట్రిబ్యునల్లు పనిచేస్తున్నాయని తెలిపారు. నిరాదరణకు గురైన వయోవృద్ధులు టోల్ ఫ్రీ నం.14567లో సంప్రదించవచ్చని సూచించారు.

Similar News

News March 4, 2026

వరంగల్: డ్రంకెన్ డ్రైవ్‌లో 105 మందిపై కేసులు

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో 105 మంది పట్టుబడ్డారు. ఇందులో అత్యధికంగా ట్రాఫిక్ విభాగంలోనే 57 కేసులు నమోదయ్యాయి. సెంట్రల్ జోన్‌లో 16, వెస్ట్ జోన్‌లో 30, ఈస్ట్ జోన్‌లో 2 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

News March 4, 2026

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

యుద్ధం మొదలైన రోజు అమాంతం పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వీటి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,110 తగ్గి రూ.1,64,510కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,850 పతనమై రూ.1,50,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.20వేలు తగ్గింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది.

News March 4, 2026

జనగామలో విషాదం.. అన్నదమ్ముల మృతి

image

జనగామలో మంగళవారం జరిగిన <<19292392>>రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరాఠీ దినేష్ (24), భూణేష్ (21)<<>> వరుసకు అన్నదమ్ములు. వీరు జనగామ జ్యోతి నగర్‌లో వారి కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. దినేష్ ఫొటో గ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. స్నేహితులతో హోలీ సంబరాలు చేసుకొని, సిద్దిపేట ఫ్లై ఓవర్ మీదుగా వస్తుండగా టాటా ఏస్ వాహనాన్ని ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే. టాటా ఏస్ వాహన డ్రైవర్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు.