News November 19, 2025
ASF వయోవృద్ధుల సంరక్షణకు టోల్ ఫ్రీ నంబర్

తల్లిదండ్రులను సరిగా పోషించని బిడ్డలపై ఇప్పటి వరకు ASF జిల్లాలో 28 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మార్పునకు కృషి చేస్తున్నామన్నారు. వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం – 2007 ప్రకారం ట్రిబ్యునల్లు పనిచేస్తున్నాయని తెలిపారు. నిరాదరణకు గురైన వయోవృద్ధులు టోల్ ఫ్రీ నం.14567లో సంప్రదించవచ్చని సూచించారు.
Similar News
News March 5, 2026
కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు: పవన్ కళ్యాణ్

AP: రాబోయే జడ్పీ ఎన్నికలను కొత్త జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని Dy CM పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తెలిపారు. పంచాయతీల పునర్విభజనకూ న్యాయపరమైన అడ్డంకులు లేవని చెప్పారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసే, నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగ్ వేసి సంరక్షించేలా వ్యవస్థను తీసుకువస్తామని తెలిపారు. బెంగళూరు నర్సరీల్లో అమలు చేస్తున్న అత్యాధునిక విధానాలను పరిశీలిస్తున్నామని వివరించారు.
News March 5, 2026
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి: గద్వాల కలెక్టర్

గద్వాల జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. టూరిజం పాలసీలో 27 స్పెషల్ టూరిజం ప్రాంతాలను ప్రభుత్వం రాష్ట్రంలో గుర్తించిందన్నారు. అందులో గద్వాల జిల్లా ఉందన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఐ డెక్ ఆర్కిటెక్చర్ ప్రతిపాదనలపై గురువారం ఐడీఓసీలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలంపూర్ ఆలయాల వద్ద ప్రసాద్ స్కీం ఏర్పాటు అయిందన్నారు.
News March 5, 2026
కర్నూలు: ఇంటర్ పరీక్షలకు 79 మంది డుమ్మా

కర్నూలు జిల్లాలో గురువారం ఇంటర్ ఓపెన్ స్కూల్ హిందీ, తెలుగు, ఉర్దూ పరీక్షలు జరిగాయి. 79 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్.సుధాకర్ తెలిపారు. 889మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 810మంది వచ్చారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 4 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసింది. డీఈవో 2 సెంటర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.


