News April 13, 2024

ఇంటర్ ఫలితాలు.. 1000కి 991 మార్కులు

image

AP: నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు ‘టాప్’లో నిలిచారు. గాజువాకకు చెందిన శరగడం పావని సెకండియర్ బైపీసీలో 1000కి 991(ఫస్ట్ ఇయర్‌లో 435) మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. ఇంగ్లిష్‌లో 97/100, సంస్కృతంలో 99/100, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 60/60, ప్రాక్టికల్స్‌లో 120/120 మార్కులు వచ్చాయి. ప్రకాశం జిల్లా మూలగుంటపాడుకు చెందిన కిరణ్మయి 990 మార్కులతో రెండో స్థానంలో నిలిచింది.

Similar News

News April 17, 2026

‘గరుడ’ విష్ణుమూర్తి వాహనం ఎలా అయ్యాడు?

image

వినత కుమారుడైన గరుడుడు తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించడానికి కద్రువ కోరిక మేరకు దేవలోకం నుంచి అమృతాన్ని తెస్తాడు. అపారమైన శక్తి ఉన్నా, అమృతంపై ఆశ పడడు. తల్లి కోసం నిస్వార్థంగా పనిచేసిన ఆయన ధైర్యం మహావిష్ణువును మెప్పించాయి. దీంతో విష్ణుమూర్తి, అతనికి చిరంజీవిత్వం ప్రసాదించి తన వాహనంగా, ధ్వజంగా స్వీకరించారు. గరుడుడు సముద్రాలను దాటగలడు. వేగవంతుడు. విష్ణు సాయం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

News April 17, 2026

IPL: బోణీ కొట్టి బోల్తా పడింది!

image

ఐదుసార్లు ఛాంపియన్ MI ఈ IPLలో దారుణంగా ఆడుతోంది. తొలి మ్యాచులో KKRపై గెలిచి బోణీ కొట్టిన ఆ జట్టు తర్వాత 4 మ్యాచుల్లోనూ ఓడిపోయింది. దీంతో -1.076 నెట్‌రన్‌తో పాయింట్ల టేబుల్‌లో చివరి నుంచి రెండో ప్లేసులో నిలిచింది. జట్టులో సీనియర్లు రోహిత్, సూర్య, హార్దిక్, తిలక్ గొప్పగా రాణించడం లేదు. పేసర్లలో బుమ్రా, చాహర్ తేలిపోతున్నారు. పాండ్య కెప్టెన్సీపైనా అటు ప్లేయర్లు, ఇటు ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.

News April 17, 2026

నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

image

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.