News November 19, 2025
పెద్దపల్లి: అభయ హస్తం పథకానికి ఈనెల 21 వరకు గడువు.!

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద రూ.లక్ష రూపాయల ప్రోత్సాహం కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ బలరాం మంగళవారం ప్రకటించారు. అభ్యర్థుల విజ్ఞాపనల మేరకు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అభ్యర్థులు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.
Similar News
News March 24, 2026
ADB: జిల్లాలో 15కు చేరనున్న అసెంబ్లీ స్థానాలు..?

కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రాజకీయ ముఖచిత్రం మారనుంది. ప్రస్తుతం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 50 శాతం పెరుగుదల ప్రకారం ఈ సంఖ్య 15కు చేరే అవకాశం ఉంది. అదిలాబాద్ అర్బన్, నిర్మల్, మంచిర్యాల వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాలు విభజనకు గురై కొత్త సెగ్మెంట్లు ఏర్పడవచ్చు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు.
News March 24, 2026
NGKL: మండుతున్న ఎండలు.. ఐనోల్‌లో 38.9 డిగ్రీలు!

జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అచ్చంపేట మండలం ఐనోల్‌లో 38.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బొల్లంపల్లి(38.6), కొల్లాపూర్(38.2)లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News March 24, 2026
WGL: ఎన్నికలు ముగిశాయి.. డిపాజిట్లు వచ్చేదెన్నడు?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా సాగిన పంచాయతీ ఎన్నికలు ముగిసినా, అభ్యర్థుల డిపాజిట్ల విడుదలపై స్పష్టత కరువైంది. జిల్లా వ్యాప్తంగా 1684 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన 26,071 మందిలో సుమారు 70 శాతం మంది అభ్యర్థులు డిపాజిట్లు దక్కించుకున్నారు. ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా, తమ నిధులు ఎప్పుడు తిరిగిస్తారా అని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


