News November 19, 2025
అనకాపల్లి జిల్లాలో 2,42,480 రైతులకు లబ్ధి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం కింద 2,42,480 మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. 19వ తేదీన రైతుల ఖాతాల్లో రూ.158.4 కోట్లు జమ కానున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో 22,300, చోడవరంలో 51,260, మాడుగులలో 45,340, నర్సీపట్నంలో35,040, పాయకరావుపేటలో 39,300, ఎలమంచిలిలో 33,760 మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు.
Similar News
News March 13, 2026
ప్రకాశం: మత్స్యకారుడి గొంతులో ఇరుక్కున్న బతికున్న చేప.. చివరికి

ప్రకాశం జిల్లాలో గురువారం వింత ఘటన చోటుచేసుకుంది. ఒంగోలుకు చెందిన ఓ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లాడు. అనంతరం చేపలు పట్టి బుట్టలో వేస్తుండగా ఓ చేప ఎగిరి అతని నోటిలో పడింది. తీసేలోపే అది కాస్తా గొంతులోకి వెళ్లింది. గమనించిన తోటి మత్స్యకారులు అతణ్ని వెంటనే ఒంగోలు GGHకు తరలించారు. ENT వైద్యులు HOD డాక్టర్ ప్రభాకర్ బృందం శస్త్రచికిత్స చేసి చాపను బయటకు తీశారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా ఉన్నారు.
News March 13, 2026
తెలుగు జాతి కీర్తి పతాక.. బూర్గుల

బూర్గుల రామకృష్ణరావు 1899 మార్చి 13న నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు కల్వకుర్తి దగ్గరలోని పడకల్‌లో జన్మించారు. HYD సంస్థానంలో ఉర్దూ ఆధిపత్యం రాజ్యమేలుతున్న రోజుల్లో తెలుగు భాషా గౌరవం కోసం నినదించిన ధీశాలి బూర్గుల. మాతృభాషలో విద్యాబోధన జరగాలని నిజాం ప్రభుత్వాన్ని ధైర్యంగా నిలదీసిన ఆయన, తెలుగువారి స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. తొలి ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్య విలువలను కాపాడారు. నేడు ఆయన జయంతి.
News March 13, 2026
హోటళ్లకు గ్యాస్ కష్టాలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాణిజ్య గ్యాస్ కొరత కష్టాలు మొదలయ్యాయి. బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ ధర భారీగా పెరగడంతో పలుచోట్ల చిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ ఆన్‌లైన్ బుకింగ్‌లు కావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్ చేస్తే కట్ అవుతోందని, సాంకేతిక ఇబ్బందులతో కష్టాలు పడుతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. మరి మీకూ ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయా? కామెంట్ చేయండి..


