News November 19, 2025
అనకాపల్లి జిల్లాలో 2,42,480 రైతులకు లబ్ధి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం కింద 2,42,480 మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. 19వ తేదీన రైతుల ఖాతాల్లో రూ.158.4 కోట్లు జమ కానున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో 22,300, చోడవరంలో 51,260, మాడుగులలో 45,340, నర్సీపట్నంలో35,040, పాయకరావుపేటలో 39,300, ఎలమంచిలిలో 33,760 మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు.
Similar News
News March 4, 2026
సంగారెడ్డి: పోస్టర్ డిజైన్‌లో సింగూరు విద్యార్థికి సత్తా

జిల్లా స్థాయి కౌమార విద్య, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ అవగాహన పోటీల్లో సింగూరు గురుకుల విద్యార్థి సత్తా చాటాడు. సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన పోస్టర్ డిజైన్ తయారీలో 10వ తరగతి విద్యార్థి జగన్ ప్రథమ స్థానం సాధించాడు. యుక్త వయస్సులో కలిగే మార్పులపై అవగాహన కల్పిస్తూ జగన్ రూపొందించిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థి ప్రతిభను గుర్తించి నిర్వాహకులు ప్రశంస పత్రాన్ని అందజేశారు.
News March 4, 2026
30,588 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం

AP: వైసీపీ హయాంలో జాకీ, లులు, అమర్‌రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ వంటి అనేక కంపెనీలను తరిమేశారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక అనేక సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. ‘మేం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చాం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 30,588 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. పరిశ్రమలు, సంస్థల్లో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి’ అని తెలిపారు.
News March 4, 2026
శ్రీ సత్యసాయి జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు

సత్యసాయి జిల్లాను ఆధ్యాత్మిక, పర్యాటక రంగాల్లో ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి కార్యాచరణను త్వరితగతిన రూపొందించాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.


