News November 19, 2025
విజయవాడలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్: మంత్రి

విజయవాడలో ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల సంక్షేమం పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. కబేలా సెంటర్లో రూ.80 లక్షలతో శాశ్వత ఐఐటీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ నిర్మిస్తామని చెప్పారు.
Similar News
News March 12, 2026
GWL: పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి

ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో 40 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 8,110 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. ఇందులో బాలికలు 4,199 మంది బాలురు, 3,858 మంది, 53 మంది ఒకసారి విఫలమైన విద్యార్థులు ఉన్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
News March 12, 2026
రష్మిక మందన్న ఆగ్రహం.. కారణమిదే!

తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై హీరోయిన్ రష్మిక సీరియస్ <<19364152>>అయిన<<>> విషయం తెలిసిందే. రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ రద్దయ్యాక ఆమె తల్లి సుమన్ మందన్న ఇచ్చిన పాత ఇంటర్వ్యూను కొందరు వక్రీకరిస్తూ వార్తలు రాయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ‘గీత గోవిందం’ వివాదం, పెళ్లి తర్వాత నటన మానెయ్యాలనే ఆంక్షలు, రక్షిత్ తల్లికి సారీ చెప్పమనడం వంటి విషయాలను కన్నడ మీడియా తప్పుగా రాయడంతో ఆమె ఇలా రియాక్ట్ అయ్యారని సమాచారం.
News March 12, 2026
భూపాలపల్లిలో మండుతున్న ఎండలు!

జిల్లాలో ఫిబ్రవరి చివరి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, మార్చి మొదటి వారంలోనే 38 డిగ్రీల మార్కును దాటాయి. గురువారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ప్రభావంతో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఇప్పటి నుంచే ఈ పరిస్థితి ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని జిల్లా వాసులు వణికిపోతున్నారు.


