News November 19, 2025

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి: డీఈఓ

image

విద్యార్థులకు నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం అందించి వారికి బంగారు భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని డీఈఓ జనార్ధన్రెడ్డి సూచించారు. మంగళవారం క్రిష్టిపాడు, దొర్నిపాడు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించి, విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేశారు. పాఠశాల పనితీరు, విద్యార్థుల క్రమశిక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News March 5, 2026

నేడు షా సమక్షంలో నితీశ్ నామినేషన్?

image

బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేడు కేంద్రహోంమంత్రి అమిత్ షా సమక్షంలో రాజ్యసభ నామినేషన్ వేసే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈరోజు NDA శ్రేణులతో భేటీకి షా బిహార్ రానున్నారు. ఈ సందర్భంగా BJP చీఫ్ నితిన్ నబీన్‌తో పాటు నితీశ్ కూడా షా సమక్షంలో నామినేషన్‌ వేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే జేడీయూలో ఓ వర్గం ఇందుకు సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో బిహార్ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

News March 5, 2026

మిల్లెట్ మహిమ: 106 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా లక్ష్మమ్మ

image

నేటి కల్తీ ఆహారపు విషవలయంలో మానవుడి సగటు ఆయువు 70ఏళ్లకే పరిమితమవుతుంటే, నంద్యాల(D) పాములపాడు మండలం చెలిమిళ్లకు చెందిన లక్ష్మమ్మ 106 ఏళ్లు పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వయసులోనూ ఆమె చూపు మందగించకపోవడం, తన పనులు తానే చేసుకోవడం విశేషం. ఆ రోజుల్లో తీసుకున్న రాగి సంగటి, జొన్న రొట్టెలు, కొర్రలు, సజ్జలు వంటి ప్రకృతి సిద్ధమైన ఆహారం ఆమెను నేటికీ ఆరోగ్యంగా ఉంచాయని మేనల్లుడు ఏసన్న తెలిపారు.

News March 5, 2026

సిద్దిపేట: వృద్ధులే లక్ష్యంగా మోసాలు.. జాగ్రత్త

image

అమాయక వృద్ధ మహిళలను నమ్మించి నగదుతో పాటు 8 తులాల బంగారం కాజేసిన ఇద్దరు నిందితులను సిద్దిపేట టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇల్లు కట్టుకుంటామని నమ్మించి బాధితుల వద్ద నుంచి బంగారం తీసుకుని, వాటిని విక్రయించినట్లు ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అపరిచితులను నమ్మి విలువైన వస్తువులు ఇవ్వొద్దని పోలీసులు సూచించారు.