News April 13, 2024

ఇమామ్, మౌజన్లకు వేతనాలు విడుదల

image

AP: రాష్ట్రంలోని మసీదులలో పని చేసే ఇమామ్, మౌజన్లకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు గౌరవ వేతనాన్ని విడుదల చేసింది. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి నెల వరకు 6 నెలల కాలానికి సంబంధించిన రూ.45 కోట్లను ఆయా మసీదుల ఖాతాలకు జమ చేసినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 16, 2024

రేవంత్‌కు కష్టం వస్తే బండి కాపాడుతున్నారు: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బీజేపీ రక్షణ కవచంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. రేవంత్‌కి కష్టం వచ్చినప్పుడల్లా బండి సంజయ్ కాపాడుతున్నారని అన్నారు. సీఎంను తిడితే బీజేపీలోని నేతలకు కోపం వస్తుందన్నారు. రేవంత్ కాంగ్రెస్‌లో ఉన్నారో.. బీజేపీలో ఉన్నారో అనే అనుమానం కలుగుతుందని దుయ్యబట్టారు. దేవుళ్లను మోసం చేసిన వ్యక్తి రేవంత్ అని మండిపడ్డారు.

News November 16, 2024

మా గెలుపు చిన్నదేం కాదు: జైశంకర్

image

ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి గెలవడం చిన్న విషయం కాదని EAM జైశంకర్ అన్నారు. ‘చాలా దేశాల్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న టైమ్‌లో భారత్‌లో రాజకీయ స్థిరత్వాన్ని ప్రపంచం గమనిస్తోంది. మనలా 7-8% గ్రోత్‌రేట్ మెయింటేన్ చేయడం వారికి సవాల్‌గా మారింది’ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ విజయం పైనా ఆయన స్పందించారు. US ఎన్నికలు గ్లోబలైజేషన్‌పై అసంతృప్తిని ప్రతిబింబించాయని, దానివల్ల చైనాకే లబ్ధి కలిగిందని చెప్పారు.

News November 16, 2024

ధనుష్.. మీకు తగిన విధంగా బదులిస్తాం: నయనతార

image

‘నానుమ్ రౌడీ దాన్’ షూట్ సమయంలో ఫోన్లలో తీసుకున్న క్లిప్స్‌కు కూడా ధనుష్ పరిహారం అడుగుతున్నారని నయనతార ఆవేదన వ్యక్తం చేశారు. ‘ధనుష్.. మీరు నిర్మాత అయినంత మాత్రాన మా జీవితాల్ని నియంత్రిస్తారా? మీ నోటీసులకు చట్టప్రకారం తగిన విధంగా జవాబిస్తాం. ఆ మూవీ వచ్చి పదేళ్లైనా మీరు ఇంకా మాపై విషం కక్కుతున్నారు. ఆడియో వేడుకల్లో నటించే వ్యక్తిత్వాన్ని మీ నిజజీవితంలో కనీసం సగమైనా అనుసరించండి’ అని పేర్కొన్నారు.