News November 19, 2025

నేడు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

Similar News

News March 15, 2026

నెల్లూరు: 7th క్లాస్ బాలిక..9th క్లాస్ బాలుడికి పెళ్లి

image

గుడ్లూరు మండలంలో బాల్య వివాహం జరిగింది. 7వ తరగతి చదువుతున్న బాలికకు, 9వ తరగతి చదువుతున్న బాలుడికి వాళ్ల పెద్దలు శుక్రవారం వివాహం జరిపించినట్లు సమాచారం ఒంగోలులోని స్వచ్ఛంద సంస్థకు తెలిసింది. చట్ట విరుద్ధమైన ఈ బాల్య వివాహాన్ని అడ్డుకోవాలని సంస్థ ప్రతినిధి కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీని కోరారు. ఆయన వెంటనే జోక్యం చేసుకొని బాలికను బాలికా సదన్‌కు తరలించాలని ఆదేశించారు.

News March 15, 2026

నెల్లూరు: మహిళా కండక్టర్‌కు HIV ఉందంటూ అవమానం!

image

నెల్లూరు జిల్లాలోని గూడూరు డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్ తనను వైద్యురాలు అందరిలో అవమానించి, HIV ఉందంటూ తప్పుడు ధ్రువీకరణ ఇచ్చిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ అధికారులు విచారణ జరిపి వైద్యురాలిని మందలించినట్లు తెలుస్తోంది. బాధితురాలు ల్యాబ్‌లో రక్త పరీక్షలు చేయించగా నెగటివ్ రిపోర్టు వచ్చిందని బాధితురాలు తెలిపారు.

News March 15, 2026

నకిలీ సందేశాలను నమ్మవద్దు : విద్యుత్ శాఖ

image

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు పంపుతున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి శనివారం ఒక ప్రకటనలో కోరారు. మీ విద్యుత్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని మెసేజ్‌లు వస్తున్నాయన్నారు. మరిన్ని వివరాల కోసం ఒక ఫోన్ నంబరును సంప్రదించాలంటూ సందేశాలు అందుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.