News November 19, 2025

అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ అరెస్ట్

image

హరియాణా ఫరిదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్ధిఖీని మనీలాండరింగ్ కేసులో ED అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు, టెర్రర్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న వర్సిటీ సహా 25 ప్రాంతాల్లో ED సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించింది. ఈక్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుంది. కాగా వర్సిటీలో పనిచేసిన ముగ్గురు డాక్టర్లకు ఉగ్ర కుట్రతో సంబంధాలున్నాయన్న కోణంలో విచారణ జరుగుతోంది.

Similar News

News March 20, 2026

వాట్సాప్‌లో సూపర్ అప్‌డేట్

image

వాట్సాప్ త్వరలో ఫోన్ నంబర్ల స్థానంలో యూజర్ నేమ్స్, యునిక్ ఐడీలను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో ఇది లాంచ్ కానున్నట్లు సమాచారం. దీంతో ఫోన్ నంబర్ల అవసరం లేకుండానే కొత్త ఫ్రెండ్స్, గ్రూప్స్‌తో కనెక్ట్ అవొచ్చు. ఫోన్ నంబర్లతోనే కంటిన్యూ అవ్వాలనుకునేవారు ఆప్షనల్ ప్రైవసీ ఫీచర్ ఎంచుకోవచ్చు. ఇక దీంతో పాటు వాట్సాప్ లేని వారితో చాట్ చేసేందుకు వీలుగా గెస్ట్ చాట్ ఫీచర్ తేనున్నట్లు తెలుస్తోంది.

News March 20, 2026

రెండు వారాల్లో వీటన్నింటి ధరలు పెరిగాయ్: కాంగ్రెస్

image

ప్రధాని మోదీ హయాంలో దేశంలో అన్ని ధరలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గత రెండు వారాల్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.146, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60, రిఫైన్డ్ ఆయిల్ రూ.30/L, పామ్ ఆయిల్ రూ.15/L, ఇండస్ట్రియల్ డీజిల్ రూ.22/L, ప్రీమియం పెట్రోల్ రూ.2.35/L, జొమాటో డెలివరీ ఫీ రూ.2.40, విమాన టికెట్లు రూ.425-2,300, ప్లాస్టిక్ బాటిల్ సెట్ రూ.40, ఇండక్షన్ స్టవ్ ధర 40% పెరిగిందని పేర్కొంది.

News March 20, 2026

300 గ్యాంబ్లింగ్, బెట్టింగ్ సైట్లు బ్యాన్

image

చట్టవిరుద్ధమైన గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ఏకంగా అలాంటి 300 సైట్లు, యాప్‌లను నిషేధించింది. వాటిలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్, ఆన్‌లైన్ కేసినో ఆఫరింగ్ స్లాట్స్, లైవ్ డీలర్ టేబుల్స్, p-2-p బెట్టింగ్, రియల్ మనీ కార్డ్, సట్టా/మట్కా గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్స్ ఉన్నాయి. మొత్తం 8,400 ఇల్లీగల్ సైట్లు ఉండగా కేంద్రం ఇప్పటివరకు 4,900 సైట్లను బ్లాక్ చేసింది.