News November 19, 2025

సిర్పూర్(టి): ఈ నెల21 షూటింగ్ బాల్ పోటీలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి అస్మిత ఖేలో ఇండియా షూటింగ్ బాల్ బాలికల ఎంపిక పోటీలు ఈ నెల 21న సిర్పూర్ (టి)లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించనున్నారు. క్రీడాకారులు ధ్రువపత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరై, ప్రిన్సిపల్ లావణ్యకు రిపోర్ట్ చేయాలని జిల్లా షూటింగ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి గురువేందర్ తెలిపారు.

Similar News

News March 6, 2026

లక్ష మందికి ఉగాది కానుక!

image

AP: ఉగాది పండుగ పురస్కరించుకొని లక్ష మందికి ఈ నెల 18వ తేదీన టిడ్కో ఇళ్లు అందజేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. జూన్ నాటికి మిగతా టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడించారు. అటు 2028 కల్లా పట్టణ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక TDR బాండ్ల జారీలో గత ప్రభుత్వం వందల రూ.కోట్ల అక్రమాలకు పాల్పడిందని, దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు.

News March 6, 2026

నస్రుల్లాబాద్: రొట్టె ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

image

నస్రుల్లాబాద్ మండలం దుర్కికి చెందిన చిన్న మొగులయ్య ఈ నెల 4న రాత్రి ఇంట్లో రొట్టె ముక్కలు తిని, గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక బయటకు వచ్చి రోడ్డుపై పడి మృతి చెందాడు. రొట్టె ముక్క వలన..? ఇతర కారణాల అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేశామని ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. భార్య ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 6, 2026

చంద్రగిరి: MBU విద్యార్థి సూసైడ్

image

చంద్రగిరి మండలంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా బాలాపల్లికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి మోహన్ బాబు యునివర్సిటీ(MBU)లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రామిరెడ్డిపల్లిలో రూము తీసుకుని ఉంటున్నాడు. ఏమైందో ఏమో గానీ గురువారం తన రూములో ఉరేసుకున్నాడు. సూసైడ్‌కు కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఇదే కాలేజీకి చెందిన ఓ యువతి సైతం సూసైడ్ చేసుకుంది. వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.