News November 19, 2025

వేమనపల్లిలో విషాదం.. అనాథలైన ముగ్గురు చిన్నారులు

image

వేమనపల్లి మండలంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు కుమారులు, ఒక కూతురు అనాథలయ్యారు. ఆరేళ్ల క్రితం కరోనా మహమ్మారి సమయంలో తండ్రిని కోల్పోయిన ముగ్గురు చిన్నారులు.. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో తల్లిని కోల్పోయారు. వరుసగా జరిగిన ఈ రెండు దుర్ఘటనలు ఆ కుటుంబ భవిష్యత్తును చీకటిలోకి నెట్టేశాయి. ముగ్గురు చిన్నారుల అనాథ స్థితి అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.

Similar News

News March 28, 2026

మోదీ-ట్రంప్ కాల్‌లో ఎలాన్ మస్క్ లేరు: కేంద్రం

image

ప్రధాని మోదీ, US ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి ఖండించారు. ఈ నెల 24న మోదీ, ట్రంప్ మధ్య మాత్రమే టెలిఫోన్ సంభాషణ జరిగిందని స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై వారు మాట్లాడుకున్నారని తెలిపారు.

News March 28, 2026

గాజువాక: సిలిండర్లతో పరారైన గ్యాస్ బాయ్

image

గాజువాకలోని మణికంఠ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న గ్యాస్ బాయ్ అప్పారావు 30 సిలిండర్లతో పరారైపోయాడు. కస్టమర్ల వద్ద నుంచి ఓటీపీలు సేకరించి సిలిండర్లు ఇవ్వకుండా పరార్ కావడంతో లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చి ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లిన అప్పారావు ఏజెన్సీకి రాకపోవడంతో గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వో ఏజెన్సీకి వచ్చి నిర్వాహకులపై మండిపడ్డారు.

News March 28, 2026

సూర్యాపేట: ప్రశాంతంగా పదో తరగతి గణితం పరీక్ష: DEO

image

సూర్యాపేట జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా డీఈవో అశోక్ తెలిపారు. 69 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 12,364 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 12,349 మంది హాజరయ్యారు. నలుగురు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, డీఈఓ 36 కేంద్రాలను తనిఖీ చేశారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని, పరీక్షలు సజావుగా సాగాయని ఆయన తెలిపారు.