News November 17, 2025

US నుంచి LPG దిగుమతి.. తగ్గనున్న ధరలు: హర్దీప్‌సింగ్

image

అమెరికా నుంచి LPGని దిగుమతి చేసుకునేందుకు కీలక ఒప్పందం కుదిరిందని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ తెలిపారు. ‘ఏడాదిపాటు ఈ డీల్ అమల్లో ఉంటుంది. IND కంపెనీలు 2.2MTPA ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఇది మొత్తం వార్షిక దిగుమతుల్లో 10 శాతానికి సమానం. ప్రజలకు మరింత తక్కువ ధరకు LPGని అందించడంలో ఇదొక ముందడుగు. ప్రస్తుతం సిలిండర్ ధర ₹1100 ఉన్నప్పటికీ ₹500-550కే అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Similar News

News November 17, 2025

ఐబొమ్మ క్లోజ్.. MovieRulz ఎప్పుడు?

image

సినిమాలను పైరసీ చేసి సినీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న సైట్లను క్లోజ్ చేసే చర్యలు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న ఐబొమ్మ సైట్ నిలిచిపోయింది. అలాగే రిలీజైన రోజే పైరసీ చేసే MovieRulz, Tamil Rockers వంటి ఇతరత్రా సైట్స్‌ పని పట్టి ఇండస్ట్రీకి న్యాయం చేయాలని పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. పైరసీ నెట్‌వర్క్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 31 కృష్ణ జింకలు మృతి

image

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.