News November 19, 2025
శుభ సమయం (19-11-2025) బుధవారం

✒ తిథి: బహుళ చతుర్దశి ఉ.8.29 వరకు
✒ నక్షత్రం: స్వాతి ఉ.7.49 వరకు
✒ శుభ సమయాలు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ప.12.00-1.30 వరకు
✒ యమగండం: ఉ.7.30-9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-12.24 వరకు
✒ వర్జ్యం: మ.2.01-3.47
✒ అమృత ఘడియలు: రా.12.43-2.29
Similar News
News March 14, 2026
ఇరాన్‌పై అత్యంత శక్తిమంతమైన బాంబులు వేశాం: ట్రంప్

మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన బాంబులను ఇరాన్‌లోని <<19335967>>ఖర్గ్<<>> ద్వీపంపై వేశామని ట్రంప్ ప్రకటించారు. అందులోని మిలిటరీ స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని, ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను టచ్ చేయలేదని చెప్పారు. హార్ముజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటే మాత్రం వెంటనే ఆ పని చేసి తీరుతామని స్పష్టం చేశారు. తన హయాంలో అమెరికా సైన్యం చాలా పవర్‌ఫుల్‌గా మారిందని, తమ దాడులను తట్టుకునే శక్తి ఇరాన్‌కు లేదన్నారు.
News March 14, 2026
‘వేటగాడు’ నిర్మాత అర్జునరాజు కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.అర్జునరాజు(80) నిన్న హైదరాబాద్‌లో వృద్ధ్యాప్య సమస్యలతో కన్నుమూశారు. ఎన్టీఆర్ ‘వేటగాడు’ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిన ఆయన ‘కొండవీటి సింహం’, ‘జేబుదొంగ’, ‘అడవి సింహాలు’, ‘బావనచ్చాడు’, ‘జాబిల్లి’, ‘మా నాన్నకు పెళ్లి’ వంటి సినిమాలను నిర్మించారు. హిందీలో 6 సినిమాలు చేశారు. ఆయన కుమారుడు రామలింగరాజు కూడా ‘జగపతి’, ‘మా అల్లుడు వెరీగుడ్’ వంటి సినిమాలను ప్రొడ్యూస్ చేశారు.
News March 14, 2026
కూరగాయ పంటల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఈ సమయంలో కూరగాయ పంటల్లో నీటి ఎద్దడి నివారణకు 2% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. మొక్క పెరగడానికి లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 5 గ్రా. కలిపి స్ప్రే చేయాలి. టమాట, పుచ్చలలో కాయ పగుళ్లు నివారణకు లీటరు నీటికి బోరాక్స్ 3గ్రా. కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా లీటరు నీటికి ఎసిటామిప్రిడ్ 0.3గ్రా లేదా ఫిప్రోనిల్ 2ML కలిపి పిచికారీ చేయాలి.


