News November 19, 2025

శుభ సమయం (19-11-2025) బుధవారం

image

✒ తిథి: బహుళ చతుర్దశి ఉ.8.29 వరకు
✒ నక్షత్రం: స్వాతి ఉ.7.49 వరకు
✒ శుభ సమయాలు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ప.12.00-1.30 వరకు
✒ యమగండం: ఉ.7.30-9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-12.24 వరకు
✒ వర్జ్యం: మ.2.01-3.47
✒ అమృత ఘడియలు: రా.12.43-2.29

Similar News

News March 28, 2026

రైతులకు ఐడీ కార్డులు.. ₹215 కోట్లతో ప్రోత్సాహకాలు

image

TG: రాష్ట్రంలో కూరగాయల సాగును పెంచేందుకు ప్రభుత్వం రైతులకు ప్రత్యేక ‘కిసాన్ ఐడీ కార్డులు’ జారీ చేయనుంది. వీటి ద్వారా లోన్లు, మార్కెటింగ్ సదుపాయాలు ఈజీగా అందుతాయి. ₹215 కోట్ల బడ్జెట్‌తో పందిళ్లు, యంత్ర పరికరాలపై 50% సబ్సిడీని ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో సాగు విస్తీర్ణాన్ని 2.50 లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. కోతుల నుంచి రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకూ సహకారం అందించనుంది.

News March 28, 2026

వామ్మో.. సగం విమానాల్లో లోపాలు

image

గతేడాది కాలంలో తనిఖీ చేసిన 754 విమానాల్లో ఏకంగా 377 విమానాల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు పార్లమెంటరీ కమిటీ గుర్తించింది. ముఖ్యంగా ఎయిరిండియా, ఇండిగో విమానాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2025 జూన్‌లో జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత చేపట్టిన ఆడిట్‌లో ఈ నిజాలు బయటపడ్డాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పూర్తిగా ప్రక్షాళన చేయాలని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది.

News March 28, 2026

చిరంజీవి గొప్ప మనసు.. అవార్డు డబ్బు విరాళంగా

image

చిరంజీవి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల ప్రభుత్వం అందించిన ‘NTR జాతీయ పురస్కారం’తో పాటు వచ్చిన ₹10 లక్షలను ఆయన స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. సర్వ్, దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్, వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లతో పాటు క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారి చికిత్స కోసం బసవతారకం ఆసుపత్రికి ఈ సాయం అందించారు. శుక్రవారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషం.