News April 13, 2024
నంద్యాల: అటెండర్ కుమార్తెకు 910 మార్కులు

మహానంది క్షేత్రంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న వీరయ్య ఆచారి రెండో కుమార్తె నాగలక్ష్మి ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటింది. నంద్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న నాగలక్ష్మి ఇంటర్ బైపీసీలో 910/1000 మార్కులు సాధించింది. ఈ మేరకు మహానందీశ్వరస్వామి దేవస్థానం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవిశంకర్ అవధాని, ఆలయ ఈఓ కాపు చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది విద్యార్థిని నాగలక్ష్మిని అభినందించారు.
Similar News
News March 12, 2026
జగన్ విమర్శలు దొంగే దొంగ అన్నట్లున్నాయి: ఆది కృష్ణమ్మ

కూటమి ప్రభుత్వంపై YCP అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలు దొంగే దొంగ దొంగ అన్నట్లున్నాయనిని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ విమర్శించారు. కర్నూలులో ఆమె మాట్లాడారు. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను కూడా తీసుకు రాలేదని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు.
News March 12, 2026
ఉత్తమ సేవా పతకాలకు 27 మంది పోలీసుల ఎంపిక

కర్నూలు జిల్లా పోలీసు శాఖలో విశిష్ఠ సేవలు అందించిన 27 మంది అధికారులు, సిబ్బందికి 2025 సంవత్సరానికి గాను ఉత్కృష్ట సేవా పతకం, అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపిక చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌తో పాటు వివిధ సేవల్లో ప్రతిభ చూపినందుకు ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో వీరికి పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
News March 12, 2026
కర్నూలు జిల్లాలో 1.75 లక్షల హెక్టార్లలో రబీ పంటల సాగు

కర్నూలు జిల్లాలో 2025-26 రబీ సీజన్ పంటల నమోదు ప్రక్రియ పూర్తయిందని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి గురువారం తెలిపారు. రైతు సేవా కేంద్రాల వారీగా వివరాలు అందుబాటులో ఉంచమని రైతులు తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా రైతు సేవా కేంద్రాల్లో తెలియజేయాలన్నారు. అభ్యంతరాలకు ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఈకేవైసీ లేదా బయోమెట్రిక్ ద్వారా ప్రక్రియ పూర్తి చేయవచ్చని సూచించారు.


