News April 13, 2024
విదేశాలకు వెళ్లిన విజయమ్మ?

AP: సీఎం జగన్, షర్మిల ప్రచార ఒత్తిడి తట్టుకోలేక వారి తల్లి వైఎస్ విజయమ్మ అమెరికాలోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ఇటీవల జగన్ చేపట్టిన ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభానికి ముందు ఆమె ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే షర్మిల చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభ సమయంలో కూడా ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇప్పుడు ఎవరికి ప్రచారం చేయాలో తేల్చుకోలేక అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.
Similar News
News March 21, 2026
మార్చి 21: చరిత్రలో ఈ రోజు

1857: జపాన్‌లో భారీ భూకంపం.. 100,000 మంది మృతి
1916: షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం
1970: నటి శోభన జననం(ఫొటోలో)
1978: బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ జననం
1990: అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి మరణం
2022: రంగస్థల నటుడు, దర్శకుడు తల్లావజ్జుల సుందరం మరణం
*ప్రపంచ అటవీ దినోత్సవం
*ప్రపంచ కవితా దినోత్సవం
News March 21, 2026
కీచక జ్యోతిషుడితో లింక్స్.. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాజీనామా

నాసిక్(MH) <<19426361>>జ్యోతిషుడు<<>> అశోక్ కారత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అతడితో ఉన్న ఫొటోలు, లింక్స్ బయటపడటంతో మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రూపాలి చకన్కర్ రాజీనామా చేశారు. అంతకుముందు ఆ పదవి నుంచి దిగిపోవాలని MH సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆమెకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రూపాలి ఈ నెల 18 నుంచి ఆఫీసుకు వెళ్లడం లేదని తెలిసింది.
News March 21, 2026
తమిళనాడులో AIADMKదే పైచేయి?

తమిళనాడు ఎన్నికల్లో ఈసారి AIADMKదే పైచేయి అని IANS సర్వే పేర్కొనడం చర్చనీయాంశమైంది. AIADMK కూటమికి 39-40% ఓట్ షేర్ రావొచ్చని.. ఫలితంగా 234 స్థానాల్లో 114-127 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. DMK కూటమికి 104-114 సీట్లు (37-38% ఓట్ షేర్) దక్కొచ్చని పేర్కొంది. ఇక విజయ్ TVKకి 6-12 సీట్లు (14-15% షేర్) రావొచ్చని, అనేక స్థానాల్లో TVK కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చింది. <<-se>>#Elections2026<<>>


