News November 19, 2025

మావోయిస్టు నేత కొయ్యడ సాంబయ్య ఎక్కడ..?

image

మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్, చీఫ్ తిప్పిరి తిరుపతి అంగరక్షకుల అరెస్ట్ నేపథ్యంలో ములుగు(D) చెందిన కొయ్యడ సాంబయ్య @ఆజాద్ ఎక్కడ..? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈనెల 14న ఆయనతో పాటు గోదావరిఖనికి చెందిన సికాస ఆర్గనైజర్ అశోక్ లొంగిపోయే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు పోలీసు వర్గాలు వారి అరెస్ట్ /లొంగుబాటును నిర్ధారించలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Similar News

News March 22, 2026

మెదక్: 24న కలెక్టరేట్ ఎదుట నిరసన: టీపీటీఎఫ్

image

ఈనెల 24న మెదక్ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి వెంకట్ రామ్ రెడ్డి కోరారు. విద్యా రంగానికి నిధులను 20 శాతానికి పెంచాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, రెగ్యులర్ డీఈఓ పోస్టులను మంజూరు చేయాలన్నారు. ఎంఈఓ, డైట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

News March 22, 2026

సూర్యలంక బీచ్‌కి పోటెత్తిన పర్యాటకులు

image

బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో ఆదివారం పర్యాటకుల తాకిడి అధికంగా మారింది. రంజాన్ మరసటి రోజు ముస్లింలు సముద్ర తీరాలకు అధికంగా విచ్చేస్తారు. అదేవిధంగా ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు బాపట్ల మండలం విచ్చేయడంతో సముద్రతీరం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. తీరం వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

News March 22, 2026

ADB: ఈ నెల 27 నుంచి కందుల కొనుగోలు బంద్

image

కేంద్ర ప్రభుత్వ సంస్థ (నాఫేడ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (మార్క్ ఫెడ్) కందుల కొనుగోలు చేయడానికి ఈ నెల 26 వరకు అవకాశం ఉందని మార్క్ ఫెడ్ మేనేజర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌లలో కందుల కొనుగోలు నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు 27 నుంచి తమ కందులను మార్కెట్ యార్డ్‌లకు తీసుకురావద్దని సూచించారు.