News November 19, 2025

AIని గుడ్డిగా నమ్మవద్దు: సుందర్ పిచాయ్

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇచ్చే సమాధానాలను గుడ్డిగా నమ్మవద్దని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. AI కూడా తప్పులు చేసే అవకాశం ఉందని, ఇతర టూల్స్‌లో సమాచారాన్ని వెరిఫై చేసుకోవాలని చెప్పారు. విభిన్న మాధ్యమాలతో కూడిన సమాచార వ్యవస్థ ఉండటం ముఖ్యమని తెలిపారు. ఏఐ పెట్టుబడుల ‘బబుల్’ ఏ దశలోనైనా విస్ఫోటనం చెందవచ్చని, ఈ విషయంలో కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని BBC ఇంటర్వ్యూలో సూచించారు.

Similar News

News March 27, 2026

వెంకీ-కళ్యాణ్ రామ్ మూవీ.. మళ్లీ అదే కాంబినేషన్

image

వెంకీ-కళ్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడి తీస్తున్న కొత్త మూవీకి సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు హీరోలతో ఉన్న ఫొటోలను అనిల్ రిలీజ్ చేశారు. అలాగే సురేశ్ ప్రొడక్షన్స్, Z స్టూడియోస్ భాగం కానున్నట్లు తెలిపారు. ఈ మూవీలో కీర్తీ సురేశ్, కృతి శెట్టి నటిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నా మూవీ టీమ్ ప్రకటించలేదు. ఇక సాహు-అనిల్ కాంబోలో భగవంత్ కేసరి, MSVPG మూవీలు వచ్చిన విషయం తెలిసిందే.

News March 27, 2026

ఎండలు.. శరీరానికి డబుల్ షాక్!

image

సమ్మర్‌లో ఉద్యోగులపై డబుల్ ఎఫెక్ట్ పడుతుందని హెల్త్ ఎక్స్‌పర్టులు చెబుతున్నారు. ‘మధ్యాహ్నం బయటికెళ్తే హీట్ ఎక్కువ వస్తుంది. అక్కడి నుంచి ఆఫీసులోకొస్తే చాలా కూల్‌గా ఉంటుంది. ఈ సడెన్ మార్పులతో తలనొప్పి, కళ్లలో మంట, చర్మం పొడిబారడం వంటివి కనిపిస్తాయి. BP పెరగొచ్చు. అందుకే ఎండ నుంచి నేరుగా చల్లటి చోటుకు వెళ్లొద్దు. AC 24–26°C ఉండాలి. దాని ఎదురుగా కూర్చోవద్దు. నీరు ఎక్కువ తాగాలి’ అని అంటున్నారు.

News March 27, 2026

RCBvsSRH: కీలక ప్లేయర్ దూరం

image

IPL: SRHతో రేపు ఆరంభ మ్యాచ్ జరగనుండగా RCBకి మరో షాక్ తగిలింది. ఈ హైఓల్టేజ్ మ్యాచులో హేజిల్‌వుడ్ ఆడట్లేదని కోచ్ ఆండీ ఫ్లవర్ తెలిపారు. హీల్ ఇంజ్యూరీతో అతను గత OCT నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నట్లు చెప్పారు. నిన్న RCB క్యాంపులో చేరి ప్రాక్టీస్ చేస్తున్నా ఫిట్‌నెస్ సాధించలేదన్నారు. దీంతో RCB బౌలింగ్ భారం సీనియర్ బౌలర్ భువీపై పడనుంది. ఇప్పటికే నువాన్ తుషార, యశ్ దయాల్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.