News November 19, 2025
జైనథ్: 8 మంది దొంగల అరెస్ట్

ఈ నెల 14న జైనథ్‌లోని హాత్తిఘాట్ పంపుహౌస్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన రూ.4.8 లక్షల సామగ్రిని రికవరీ చేశారు. మంగళవారం 12 మందిపై కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. దొంగిలించిన సామగ్రి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రూ.7,140 నగదును స్వాధీనం చేసుకున్నారు. సామగ్రి కొనుగోలు చేసిన స్క్రాప్ దుకాణదారుడిని కూడా రిమాండ్‌కు పంపినట్లు సీఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.
Similar News
News January 27, 2026
ఇంద్రవెల్లి: ముగిసిన నాగోబా జాతర

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర నేటితో ముగిసింది. 9రోజులుగా కొనసాగిన నాగోబా జాతర ఉట్నూర్ మండలం శ్యాంపూర్ బుడుం దేవతకు పవిత్ర గంగాజలంతో ఆదివారం మహా పూజ నిర్వహించి జాతరను ప్రారంభించారు. అనంతరం “ఝరి” తాలిని భద్రపరిచేందుకు మేస్రం వంశీయులు కాలినడకతో కేస్లాపూర్‌లోని శాంతి నిలయానికి చేరుకొని మెస్రం వంశీయులు కలశం (జారీ)దేవతకు ప్రత్యేక పూజలు చేసి నాగోబా జాతరకు ముగింపు పలికారు.
News January 26, 2026
అక్రెడిటేషన్ జర్నలిస్టులే PRESS అని రాసుకోవాలి: ADB DPRO

అక్రెడిటేషన్ జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై PRESS అని స్టిక్కర్ అట్టించుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేసినట్లు ఆదిలాబాద్ పౌరసంబంధాల శాఖ అధికారి (DPRO) విష్ణువర్ధన్ తెలిపారు. PRESS లేని వారు, ఇతర వర్గాలు ఇష్టారీతిన వాహనాలపై PRESS అని రాయవద్దని సూచించారు. ఇది మోటార్ వాహన చట్టం నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.
News January 24, 2026
ADB: మేడారం మహా జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మేడారం మహా జాతరకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి జిల్లాలోని ప్రధాన కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్ తెలిపారు. ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో జాతరకు 369 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


