News November 19, 2025

తొలి ఆదివాసీ అగ్రనేత హిడ్మాయే!

image

భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందిన హిడ్మా ప్రస్థానం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా ప్రాంతంలో ఆదివాసీ గ్రామ ఆర్గనైజర్‌గా ప్రారంభమైంది. అనంతరం మావోయిస్టుల యాక్షన్ టీమ్ ఇన్‌ఛార్జ్‌గా ఎదిగి, చివరకు కేంద్ర కమిటీకి చేరిన తొలి ఆదివాసీ అగ్రనేతగా నిలిచాడు. భద్రతా బలగాలను తప్పుదారి పట్టించి, దాడులు నిర్వహించడం హిడ్మా స్టైల్. మావోయిస్టుల నిఘా వ్యవస్థతో పాటు హిడ్మాకు ప్రత్యేక వ్యవస్థ ఉండేది.

Similar News

News March 7, 2026

డేరా బాబాకు భారీ ఊరట

image

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(డేరా బాబా)కు భారీ ఊరట లభించింది. 20 ఏళ్ల కిందట జరిగిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ పంజాబ్-హరియాణా హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2019లో కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను రద్దు చేసింది. కాగా మహిళలపై అత్యాచారం కేసులో 2017 నుంచి డేరా బాబా జైలులో ఉన్నప్పటికీ దాదాపు 15 సార్లు పెరోల్‌పై బయటికొచ్చి వెళ్లారు.

News March 7, 2026

గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ ప్రెసిడెంట్!

image

US-ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై చేస్తున్న దాడులకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. ఇతర దేశాలను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేశారు. తమపై పొరుగు దేశాలు దాడి చేయకపోతే వాటిపై అటాక్ చేయొద్దనే నిర్ణయాన్ని తాత్కాలిక నాయకత్వ మండలి ఆమోదించిందని తెలిపారు. అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

News March 7, 2026

MEC తర్వాత ఏయే కోర్సులు చేయొచ్చంటే?

image

<<19311173>>ఇంటర్‌లో<<>> MEC పూర్తి చేసిన విద్యార్థులకు ఒకప్పుడు ప్రధాన లక్ష్యం ‘CA’ మాత్రమే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మ్యాథ్స్‌పై పట్టు ఉండి సాఫ్ట్‌వేర్ రంగం వైపు వెళ్లాలనుకున్నవారు BCA లేదా Data Analytics కోర్సులను ఎంచుకోవచ్చు. మేనేజ్‌మెంట్ రంగంపై ఆసక్తి ఉన్నవారు BBA ద్వారా కార్పొరేట్ కంపెనీల్లో స్థిరపడవచ్చు. డిగ్రీలో BA, B.Com, BScలో చేరవచ్చు. LAW, హోటల్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. రేపు CEC గురించి..