News November 19, 2025
టీమ్ ఇండియా ప్రాక్టీస్‌లో మిస్టరీ స్పిన్నర్

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో స్పిన్నర్ల ధాటికి టీమ్ ఇండియా ఘోరంగా <<18303459>>ఓడిన <<>>సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు మిస్టరీ స్పిన్నర్‌ను మేనేజ్‌మెంట్ రంగంలోకి దించింది. ప్రాక్టీస్ సెషన్‌లో స్పిన్నర్ కౌశిక్ మైతీ(WB)తో బౌలింగ్ చేయించింది. 2 చేతులతో బౌలింగ్ చేయగలగడం కౌశిక్ ప్రత్యేకత. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు కుడి చేతితో, రైట్ హ్యాండ్ బ్యాటర్లకు ఎడమ చేతితో బౌలింగ్ వేయగలరు.
Similar News
News March 18, 2026
3వేల డీజిల్ బస్సులు ఈవీలుగా..: CM

TG: హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం తిరుగుతున్న 3వేల డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే పెట్రోల్‌తో నడిచే ఆటోలనూ ఈవీలుగా మార్చే కార్యాచరణ చేపడుతున్నామన్నారు. కోర్ సిటీలోని పరిశ్రమలను నగరం వెలుపలకు తరలిస్తామని చెప్పారు. కోర్ సిటీలో సర్వీస్ సెక్టార్ మాత్రమే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.
News March 18, 2026
వరి పండిస్తే అత్యధిక లాభం రాదు: రేవంత్

TG: రైతులు వరి కాకుండా ఇతర పంటల వైపు మళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘వరి పండిస్తే రైతులకు అత్యధిక లాభం రాదు. వరి నుంచి వాణిజ్య, కూరగాయల పంటలవైపు మళ్లాలి. ప్రపంచానికి ఎగుమతి చేసేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం. సైంటిస్టులతో భూసార పరీక్షలు చేయించి ఏ పంట వేయాలో చెబుతాం. రైతును రాజును చేస్తాం. రైతు రుణమాఫీ చేశాం. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇచ్చాం’ అని అసెంబ్లీలో తెలిపారు.
News March 18, 2026
ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు

AP: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఇవాళ్టితో ముగిశాయి. చివరి రోజున కెమిస్ట్రీ పరీక్షకు 3.87 లక్షల మంది హాజరయ్యారు. ఈనెల 21 నుంచి వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ పి.రంజిత్ బాషా తెలిపారు. వాల్యుయేషన్ పారదర్శకంగా, తప్పులు దొర్లకుండా చేయాలని అధ్యాపకులకు సూచించారు.


