News November 19, 2025

యువతకు ఉపాధిలో జిల్లా ముందంజ: జేసీ

image

యువతకు ఉపాధి కల్పించడంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముందంజలో ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. మంగళవారం అమలాపురంలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జేసీ మాట్లాడారు. వికాస ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 36 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. మొత్తం 267 మంది ఈ జాబ్ మేళాకు హాజరయ్యారని జేసీ తెలిపారు.

Similar News

News March 15, 2026

ఏం సందేశం ఇస్తున్నారు?

image

డ్రగ్స్ కేసులో TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడటం రాజకీయ నాయకులపై ప్రజలకు అసహ్యం కలిగించేలా చేస్తోంది. వీకెండ్ వచ్చిందంటే చాలామంది నేతలు ‘ఎంజాయ్’ చేసేందుకే ఎగిరిపోతున్నారు. తీరా చూస్తే ఇలా ఫామ్‌హౌస్‌లు, పబ్‌లు, క్లబ్బుల్లో ‘గబ్బు’ పనులు చేస్తున్నారు. యువతకు లెక్చర్లు ఇచ్చే ఇలాంటి నేతలు మందు, విందు, డ్రగ్స్ తీసుకుంటూ వారికి ఏం సందేశం ఇస్తున్నారు?

News March 15, 2026

KGM: ఏపీటీసీఐఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సాయి మనోహర్

image

ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ (APTCIA) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన సాయి మనోహర్ దీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం తిరుపతి తిరుచానూరులో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో ఆయన్ని ఎన్నుకున్నారు. టైప్, కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.

News March 15, 2026

ధాన్యం కొనుగోలుకు 240 కేంద్రాలు: కలెక్టర్ సత్యశారద

image

జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో 2.10 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పౌరసరఫరాలు, మార్కెటింగ్ అధికారులతో ఆమె సమీక్షించారు.