News November 19, 2025
నేడే రైతు ఖాతాలో 2వ విడత నగదు జమ: కలెక్టర్

అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద ఇవాళ (మంగళవారం) రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయనుందని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమం జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఆదేశించారు.
Similar News
News March 13, 2026
కర్నూలులో గ్యాస్ కొరతపై అపోహలు వద్దు: జేసీ

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని, గృహ వినియోగదారులు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. ప్లాంట్లలో 3-6 రోజుల స్టాక్ అందుబాటులో ఉందన్నారు. కమర్షియల్ సంస్థలు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన పెంచాలన్నారు. మార్కెట్లలో ఆహార నాణ్యత, తూనికలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు.
News March 13, 2026
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ప్రముఖులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ విక్రాంత్ హెచ్చరించారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో తప్పుడు వార్తలు, ద్వేషపూరిత పోస్టులు చేస్తే గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.
News March 13, 2026
పరీక్షలకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు: డీఈవో

ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జిల్లా వ్యాప్తంగా జరగబోయే 10వ తరగతి పరీక్షలకు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు డీఈవో సుధాకర్ తెలిపారు. విద్యార్థులు గానీ వారి తల్లిదండ్రులు గానీ ఏదైనా అత్యవసరం ఉంటే
బాలాజీ 9000822394, శ్రీనివాసులు 8639353678 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకుంటే తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు.


