News November 17, 2025
జగిత్యాల: శీతాకాలం.. జిల్లావాసులకు SP సూచనలు

శీతాకాలం మొదలైనందున రహదారులపై పొగమంచు ఎక్కువగా ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.
1. వేగం తగ్గించాలి
2. ఫాగ్‌లైట్లు- లో బీమ్ ఉపయోగించాలి
3. ముందున్న వాహనానికి దూరం పాటించాలి
4. ఓవర్‌టేక్ చేయరాదు
5. రోడ్డుపై వాహనాలు నిలపకూడదు
6. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అని SP కోరారు.
Similar News
News November 17, 2025
ఐబొమ్మ క్లోజ్.. MovieRulz ఎప్పుడు?

సినిమాలను పైరసీ చేసి సినీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న సైట్లను క్లోజ్ చేసే చర్యలు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న ఐబొమ్మ సైట్ నిలిచిపోయింది. అలాగే రిలీజైన రోజే పైరసీ చేసే MovieRulz, Tamil Rockers వంటి ఇతరత్రా సైట్స్ పని పట్టి ఇండస్ట్రీకి న్యాయం చేయాలని పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. పైరసీ నెట్‌వర్క్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) అర్జీలను వెంటనే పరిష్కరించాలని కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఆయన 58 మంది ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు వెంటనే పంపి, సకాలంలో పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.