News April 13, 2024

నిజామాబాద్: ఇంకా మూడు రోజులే..!

image

పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నిజామాబాద్ జిల్లా అధికారులు ఓటరు నమోదుపై దృష్టి పెట్టారు. నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు నామినేషన్ల స్వీకరణకు ఇప్పటికే చర్యలు చేపట్టిన అధికారులు ఇంకా మూడు రోజులే నమోదుకు సమయం ఉండటంతో యువతకు అవగాహన కల్పిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల ఆధారంగా ఓటరు నమోదుకు చర్యలు చేపడుతున్నారు. ఈనెల 15 వరకు ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

Similar News

News September 10, 2025

NZB: GGHలో వైద్య విభాగాలను తనిఖీ చేసిన DMHO

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో కొనసాగుతున్న వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వివిధ వైద్య విభాగాలను DMHO డాక్టర్ బి.రాజశ్రీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షయ నియంత్రణ, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ విభాగం, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని, SNCU విభాగాన్ని పరిశీలించారు. సిబ్బంది పనితీరును హాజరు పట్టికలను వివిధ రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు.

News September 10, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: NZB కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. నిర్మాణాలకు ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామన్నారు.

News September 10, 2025

నిజామాబాద్: వృద్ధురాలి హత్య

image

సాలూరలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు హత్యకు గురైంది. బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చెందర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కాటం నాగవ్వ(65)ను ఆమె మరిది గంగారం, కుటుంబ సభ్యులు గొంతు నులిమి హత్య చేశారు. ఆమె ఆస్తి, బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.