News November 19, 2025
43 మంది నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు

బిహార్‌లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా 43 మంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వారిపై క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈనెల 21 లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ లోపు స్పందించకపోతే పార్టీ నుంచి తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Similar News
News March 4, 2026
రోజూ అత్యాచార బెదిరింపులు: ఆయేషా ఖాన్

తాను రోజూ ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లు ‘ధురంధర్’ స్పెషల్ సాంగ్ నటి ఆయేషా ఖాన్ వెల్లడించారు. తాను ఏం ధరించినా అసభ్య కామెంట్లు చేస్తారని, అత్యాచారం చేస్తామని బెదిరిస్తుంటారని వాపోయారు. సమాజంలో ఇదొక ప్రమాదకర వైఖరని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈమె తెలుగులో ముఖచిత్రం, ఓం భీమ్ బుష్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే, జాట్ చిత్రాల్లో నటించారు.
News March 4, 2026
ఇరాన్ మరో 10 రోజులు యుద్ధం చేస్తే USకు దెబ్బే!

యుద్ధంలో ఖమేనీని తొలిరోజే అంతం చేసిన అమెరికాకు ఇరాన్ కొరకరాని కొయ్యగా మారింది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ లొంగిపోకుండా దాడులు తీవ్రతరం చేస్తోంది. ఈ యుద్ధం 4 వారాల్లో పూర్తవుతుందని ట్రంప్ చెబుతున్నా అది మరింత కాలం సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో 10 రోజులు దాడులు కొనసాగితే అమెరికా Tomahawk మిస్సైళ్లతో పాటు SM-3 interceptors లాంటి కీలక ఆయుధాల స్టాక్స్ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు CNN పేర్కొంది.
News March 4, 2026
శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి.. 100 మంది గల్లంతు!

శ్రీలంకలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి జరిగింది. సబ్‌మెరైన్‌తో అటాక్ చేయడంతో IRIS Dena షిప్‌లోని 101 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. మరో 78 మంది గాయపడ్డారని సమాచారం. షిప్ నుంచి సాయం కోసం కాల్ వచ్చిందని, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ను పంపామని శ్రీలంక తెలిపింది. గాలే తీరంలో షిప్ మునిగిపోయిందని, తీవ్రంగా గాయపడిన 32 మందిని ఆస్పత్రిలో చేర్చినట్లు లంక మంత్రి విజిత హెరాత్ తెలిపారు. దాడి ఎవరు చేశారనేది తెలియాల్సి ఉంది.


