News April 13, 2024

LB నగర్‌‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

హైదరాబాద్ LB నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు రవి, ప్రణయ్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 30, 2025

రేపు రాత్రి దద్దరిల్లనున్న హైదరాబాద్

image

డిసెంబర్ 31ST.. ఈవెంట్లు, చిల్ మూమెంట్ల నైట్ ఇది. సిటీలో యువత పెద్ద ఎత్తున ప్లాన్‌ వేసుకుంటోంది. పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్‌లు సాయంత్రం నుంచే కళకళలాడనున్నాయి. కొందరు పబ్లిక్ స్పాట్‌లకు ప్రిఫరెన్స్ ఇస్తుంటే.. మరి కొందరు ఫ్యామిలీతో కలిసి 31ST దావత్‌‌కు తమ ఇళ్లనే వేదిక చేసుకుంటున్నారు. మార్కెట్‌లోని DJ షాపుల్లో డాన్స్‌ ఫ్లోర్లు, స్పీకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. రేపు రచ్చ.. రచ్చే.

News December 29, 2025

HYD కుర్రాళ్ల ‘విష్ జార్’ మాయ

image

కోడింగ్ రాసి అలసిపోతున్న మన Gen-Z బ్యాచ్ కొత్త ట్రెండ్ అందుకుంది. 13-wish jar మంత్రం జపిస్తోంది. ఆఫీసు గొడవలు మర్చిపోవాలని చిట్టీలు రాసి తగలబెడుతున్నారు. లక్ష్యాలను మధ్యలోనే వదిలేస్తామని భయం ఉన్నా 43% మంది డిజిటల్ మాయ వద్దని ఫిక్స్ అయ్యారు. స్క్రీన్ టైమ్ తగ్గించాలన్నది వీరి ప్లాన్. ట్రాఫిక్ జామ్ మధ్య స్లో లివింగ్ మజా వెతుక్కుంటున్నారు. సిటీ కుర్రాళ్లంతా రియల్ లైఫ్ వైబ్స్‌లో మునిగి తేలుతున్నారు.

News December 29, 2025

మిగిలింది గ్రేటర్ హైదరాబాదే!

image

TGలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు EC సమాయత్తం అవడంతో గ్రేటర్‌లో చర్చ మొదలైంది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌‌ ఇదే కావడంతో ఇక్కడి పీఠం మీద ప్రధాన పార్టీలు గురి పెడుతున్నాయి. ఓ వైపు సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడేమో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల‌ ఎన్నికలకు EC ప్రిపేర్ అవుతోంది. అయితే, GHMC పాలకవర్గం FEB-2026లోనే ముగియనుంది. దీంతో HYDలో ఎన్నికలు ఎప్పుడు? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.