News November 19, 2025
వ్యక్తిగత సమాచారం పోస్ట్ చేయవద్దు: వరంగల్ సీపీ

నేరగాళ్లు టెక్నాలజీని వాడుకొని నేరాలకు పాల్పడుతున్నారని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం వరంగల్ మెడికల్ కళాశాలలో ఆయన మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వెబ్‌సైట్‌లలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలను పోస్ట్ చేయవద్దని, ఆన్‌లైన్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపవద్దని ఆయన హెచ్చరించారు.
Similar News
News March 13, 2026
సిద్దిపేట: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

28న సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి సూచించారు. జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎక్సైజ్, మోటార్ వాహనాల కేసులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. లోక్ అదాలత్‌లో క్రిమినల్, కంపౌండ్డబుల్, సివిల్, చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలని, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కంటే లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు.
News March 13, 2026
KMR: ఇంటర్ పరీక్షలు.. 97.46% హాజరు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్ ద్వితీయ సంవత్సర కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 7,649 మంది విద్యార్థులకు గాను 7,455 మంది హాజరయ్యారని, 194 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లాలో 97.46 శాతం హాజరు నమోదైందని ఆయన వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
News March 13, 2026
HNK: ఇంటర్ పరీక్షకు 17,931 విద్యార్థులు హాజరు

హనుమకొండ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ పరీక్షకు 17,931 మంది విద్యార్థులు హాజరుకాగా 98 శాతం హాజరు నమోదయింది. 17,203 మంది జనరల్ విద్యార్థులు, 728 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 393 మంది జనరల్ విద్యార్థులు, 26 మంది ఒకేషనల్ విద్యార్థులు నేటి పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.


