News November 19, 2025
భారత్‌ను ప్రేమించే వాళ్లందరూ హిందువులే: మోహన్ భాగవత్

భారత్‌ను ప్రేమించే వారందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూ దేశంగా ఇండియా ఉండటానికి అధికారిక డిక్లరేషన్ అవసరం లేదని, మన నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు దాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. అస్సాంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ‘హిందూ అనేది కేవలం మతపరమైన పదం కాదు. వేల ఏళ్ల నాగరికత గుర్తింపు. భారత్, హిందూ రెండూ పర్యాయపదాలు’ అని తెలిపారు.
Similar News
News March 14, 2026
హార్ముజ్ దాటిన భారత నౌకలు.. మొత్తం 86వేల టన్నుల LPG

భారత్‌కు చెందిన మరో LPG క్యారియర్ హార్ముజ్ జలసంధిని దాటినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక వస్తోందని, దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోందని పేర్కొన్నాయి. మరో రెండు రోజుల్లో ముంబై లేదా కాండ్లా(గుజరాత్) ఓడరేవుకు చేరుకోనుంది. మరో షిప్ ‘శివాలిక్’ నిన్నే హార్ముజ్‌ను దాటిందని, అందులో 40వేల టన్నుల LPG ఉందని CNN NEWS 18 తెలిపింది.
News March 14, 2026
గ్యాస్ బుక్ అయినా నో డెలివరీ! మీకూ ఈ సమస్య ఉందా?

వంటగ్యాస్ ఇబ్బందులు తప్పట్లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. HYDలో గ్యాస్ బుక్ అయినా OTP రావట్లేదని, సిలిండర్ డెలివరీ కావట్లేదని వాపోతున్నారు. 4-5 రోజులుగా ఎదురుచూస్తున్నా స్పందన లేదంటున్నారు. కాగా కొందరు ఏజెన్సీలకు వెళ్లి సిలిండర్ తెచ్చుకుంటున్నారు. మరి గ్యాస్ బుకింగ్, డెలివరీలో మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో కామెంట్ చేయండి.
News March 14, 2026
కోడి పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కోడి పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి వేడి ఒత్తిడికి గురైతే నీరసంగా మారతాయి. విరేచనాలు అయ్యి నిలబడలేక వణుకుతుంటాయి. అలాగే అవి మెడలు వాల్చి సన్నగా మూలుగుతూ ఉన్నా, వాటి కంటి నుంచి నీరు కారుతున్నట్లు గుర్తించినా నిర్లక్ష్యం చేయవద్దు. ఈ లక్షణాలున్న కోడి పిల్లలను, కోళ్లను షెడ్డులోని మిగిలిన వాటి నుంచి వేరు చేసి వెటర్నరీ నిపుణులకు చూపించాలి.


