News November 19, 2025
కలెక్టర్ హెచ్చరిక

ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేసి వారికి రసీదు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తహశీల్దార్లతో పలు రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.
Similar News
News April 3, 2026
కోదాడ: బిల్డింగ్‌పై నుంచి పడ్డ విద్యార్థిని.. పరిస్థితి విషమం

కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.
News April 3, 2026
కామారెడ్డి బార్ అసోసియేషన్ ఎన్నిక

కామారెడ్డి జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా బత్తుల నారాయణ, ప్రధాన కార్యదర్శిగా బండారు సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా రాజు, సంయుక్త కార్యదర్శిగా భార్గవ్ చంద్ర భోపాల్, కోశాధికారిగా విఠల్ రావు, లైబ్రరీ సెక్రటరీగా దేవేందర్ గౌడ్, క్రీడల కార్యదర్శిగా యాదగిరి ఎంపికయ్యారు.
News April 3, 2026
నిద్రలో మీ ఛాతీపై ఎవరో కూర్చున్నట్లుగా ఉందా?

నిద్రలో ఛాతీపై ఎవరో కూర్చొని శరీరం కదలకుండా గట్టిగా పట్టుకున్నట్లు కొందరికి అనిపిస్తుంది. మాట్లాడే పరిస్థితి ఉండదు. దీన్ని ‘స్లీప్ పెరాలసిస్’ అంటారని నిపుణులు చెబుతున్నారు. ‘ఇది 2-3ని.లు ఉంటుంది. చాలా రోజులుగా సరిగ్గా నిద్రపోకపోవడం, అలసిపోవడంతో ఇలా అనిపిస్తుంది. మంచి ఫుడ్ తీసుకొని, ఒత్తిడి తగ్గించుకొని, రోజూ 6-8H నిద్రపోతే ఉపశమనం లభిస్తుంది’ అని పేర్కొంటున్నారు.
* మీకెప్పుడైనా ఇలా అనిపించిందా?


