News November 19, 2025

కలెక్టర్ హెచ్చరిక

image

ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేసి వారికి రసీదు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తహశీల్దార్లతో పలు రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.

Similar News

News March 22, 2026

ADB: చెప్పి చనిపోయిన రైతు.. స్పందించిన కలెక్టర్

image

ఆదిలాబాద్(రూ) మండలం అర్లి(బి) గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి <<19439320>>ఆత్మహత్య <<>>ఘటనపై కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. గత నవంబర్ 18, 2025న గణపతి తీసుకువచ్చిన సోయాబీన్‌లో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో ఆరబెట్టి మళ్లీ తీసుకురావాలని అధికారులు సూచించినట్లు తెలిపారు. 81 క్వింటాళ్ల సోయాబీన్‌కు సంబంధించిన మొత్తం చెల్లింపులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

News March 22, 2026

కేరళంలో షిగెల్లా వ్యాధి.. చిన్నారి మృతి!

image

కేరళంలోని కోళికోడ్‌ జిల్లాలో షిగెల్లా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెరువయల్‌ పంచాయతీలో ఇప్పటికే 12 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. దీంతో రక్త విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదేళ్లలోపు పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.

News March 22, 2026

అనంత: ఈతకెళ్లి బాలుడి మృతి

image

అనంతపురం జిల్లాలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వజ్రకరూరు మండలం పీసీ కొత్తకోటలో బావిలో ఈతకు వెళ్లిన బాలుడు మృతి చెందాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న అరుణ్(13) స్నేహితులతో కలిసి ఈత కొడుతుండగా పూడికలో ఇరుక్కొని మునిగిపోయాడు. స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.