News November 19, 2025
కలెక్టర్ హెచ్చరిక

ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేసి వారికి రసీదు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తహశీల్దార్లతో పలు రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.
Similar News
News March 7, 2026
గద్వాల్: అప్రమత్తతే రక్షణ.. హెచ్‌పీవీపై టీకాలు

ప్రాణాంతక గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్ మొటిమల నుంచి క్యాన్సర్ వరకు దారితీస్తుంది. బాలికలకు టీకాలు వేయించడం ద్వారా 93-100 శాతం వరకు దీనిని నివారించవచ్చు. గద్వాల జిల్లాలోని 14 ఏళ్ల గల బాలికలకు రేపు HPV వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సంధ్య కిరణ్మయి తెలిపారు.
News March 7, 2026
క్వాంటం కంప్యూటింగ్‌తో అనేక మార్పులు: CM

AP: క్వాంటం కంప్యూటింగ్, AIలకు ప్రపంచ కేంద్రంగా ఎదగాలనేదే ఏపీ లక్ష్యమని CM చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్, AI కోసం $15Bn ఇన్వెస్ట్ చేస్తోందన్నారు. ఢిల్లీలో జరిగిన ‘రైసినా డైలాగ్’ సదస్సులో సాంకేతికత-సుపరిపాలన అంశంపై ఆయన మాట్లాడారు. ‘అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటం కంప్యూటింగ్‌తో అనేక మార్పులు వస్తాయి. భవిష్యత్తులో ప్రజలు క్వాంటం వ్యాలీ గురించి మాట్లాడుకుంటారు’ అని పేర్కొన్నారు.
News March 7, 2026
భారత్‌పైనే ఒత్తిడి ఎక్కువ: శాంట్నర్

T20 WC ఫైనల్‌కి ముందు కివీస్ కెప్టెన్ శాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంత ఫ్యాన్స్ ముందు ఆడుతున్న భారత్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. లక్షలాది మంది భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేసి, స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చి కప్ గెలవడమే తమ లక్ష్యమన్నారు. టీమ్‌ఇండియా బ్యాటర్లను కట్టడి చేయాలంటే ఆరంభంలోనే వికెట్లు తీయడం కీలకమని, బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఛాలెంజ్ అని విశ్లేషించారు.


