News November 19, 2025

వినాయకుడిని ఏ సమయంలో పూజించడం ఉత్తమం?

image

బుధవారం వినాయకుడి పూజలకు శ్రేష్ఠం. ఉదయంతో పోల్చితే సాయంత్ర పూజల వల్ల విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. స్కంద పురాణం ప్రకారం.. సంధ్యా సమయంలో స్వామివారిని పూజిస్తే మనలోని ప్రతికూల శక్తులన్నీ హరించుకుపోతాయి. కొబ్బరి నూనె దీపం వెలిగించి, 21 గరికెలు సమర్పించి, గణేశుడి పంచరత్న స్తోత్రాన్ని పఠిస్తే.. బుద్ధి చతురత, వాక్శుద్ధి కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

Similar News

News March 15, 2026

ఉక్రెయిన్ యుద్ధంలోకి దిగింది.. దాడి చేస్తాం: ఇరాన్

image

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం మరిన్ని దేశాలకు పాకే అవకాశం ఉంది. తమ శత్రు దేశాలకు మద్దతు ఇస్తోన్న ఉక్రెయిన్‌పై దాడి చేస్తామని ఇరాన్ పార్లమెంటరీ నేషనల్ సెక్యూరిటీ కమిటీ హెడ్ ఇబ్రహీం ప్రకటించారు. ‘ఉక్రెయిన్ యుద్ధంలోకి దిగింది. మా షాహెద్ డ్రోన్లను నేలకూల్చేందుకు ఇజ్రాయెల్‌కు <<19328794>>సపోర్ట్<<>> చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ భూభాగం మొత్తాన్ని టార్గెట్ చేస్తాం’ అని హెచ్చరించారు.

News March 15, 2026

వార్ ఎఫెక్ట్.. పాక్ ఉద్యోగుల జీతాల్లో భారీ కోత

image

పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్ పాకిస్థాన్‌పై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లు <<19319137>>భారీగా పెరగగా<<>>, తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బంది జీతాల్లో కోతకు ప్రభుత్వం సిద్ధమైంది. 5 నుంచి 30 శాతం తగ్గించేందుకు ప్రధాని షెహబాబ్ షరీఫ్ ఆమోదం తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో పాక్‌లో ఇంధన, ఆర్థిక సంక్షోభం ముదురుతోందని నిపుణులు చెబుతున్నారు.

News March 15, 2026

వేసవి.. కోళ్ల దాణా విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కోళ్లకు దాణాను తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఇవ్వడం మంచిది. అలాగే వాటికి పెట్టే ఆహారంలో అవసరమైన మోతాదులో విటమిన్స్, ఖనిజ లవణాలు ఉండాలి. మాంసకృత్తులు కొంత మేర తగ్గించాలి. విటమిన్-c కూడా దీనిలో ఉండేలా చూసుకోవాలి. అందుకే వేసవిలో కోళ్లకు ఎలాంటి దాణా అందిస్తే మంచిదో తెలుసుకోవడానికి వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.